ఏపీలో కొనసాగుతున్న కరోనా వైరస్ వ్యాప్తి.. కొత్తగా ఎన్ని పాజిటివ్ కేసులు నమోదయ్యాయంటే.!

Corona Cases AP: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య ఒక రోజు పెరుగుతోంది. మరో రోజు తగ్గుతోంది. సోమవారం రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం..

ఏపీలో కొనసాగుతున్న కరోనా వైరస్ వ్యాప్తి.. కొత్తగా ఎన్ని పాజిటివ్ కేసులు నమోదయ్యాయంటే.!
AP-Corona
Follow us
Ravi Kiran

|

Updated on: Jan 05, 2021 | 6:50 PM

Corona Cases AP: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య ఒక రోజు పెరుగుతోంది. మరో రోజు తగ్గుతోంది. సోమవారం రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినట్లు అనిపించినా నేడు మరోసారి పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. తాజాగా గడిచిన 24 గంటల్లో 51,420 సాంపిల్స్ పరీక్షించగా.. కొత్తగా 377 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. 278 మంది కరోనా నుండి కోలుకుని ఆస్పత్రుల నుండి డిశ్చార్జ్ కాగా.. నలుగురు మరణించారు.

ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 8,83,587కు చేరింది. వీరిలో 8,73,427 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,038 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా కారణంగా 7122 మంది చనిపోయారు. నిన్న జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు ఇలా ఉన్నాయి.. అనంతపురం 11, చిత్తూరు 82, తూర్పుగోదావరి 21, గుంటూరు 60, కడప 21, కృష్ణా 66, కర్నూలు 5, నెల్లూరు 17, ప్రకాశం 6, శ్రీకాకుళం 11, విశాఖపట్నం 41, విజయనగరం 9, పశ్చిమ గోదావరి 27 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.

Also Read:

వాహనదారులకు అలెర్ట్.. ఇకపై హెల్మెట్ ధరించకపోతే బైక్ స్వాధీనం.. అమలులోకి వచ్చిన కొత్త రూల్.!

జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. రామతీర్ధం ఘటనపై సీఐడీ విచారణకు ఆదేశం..

కోవిషీల్డ్ వ్యాక్సిన్.. కేంద్రం అనుమతిస్తే.. ఒక్కో డోస్ రూ. 1000: సీరం సంస్థ చీఫ్

ఆరోగ్య ఆంధ్రా ట్వీట్…