దేశంలో కొత్తగా 23,950 పాజిటివ్ కేసులు, 333 మరణాలు.. తగ్గుతోన్న క్రియాశీల కేసుల సంఖ్య..
దేశంలో గడిచిన 24 గంటల్లో 23,950 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో ఇండియాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,00,99,066 చేరుకుంది.

Corona Cases India: దేశంలో గడిచిన 24 గంటల్లో 23,950 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో ఇండియాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,00,99,066 చేరుకుంది. ఇందులో 2,89,240 యాక్టివ్ కేసులు ఉండగా.. 96,63,382 కరోనా నుంచి కోలుకున్నారు. ఇక తాజాగా 333 మంది వైరస్ కారణంగా చనిపోవడంతో.. దేశంలో ఇప్పటివరకు 1,46,444 కరోనా మరణాలు సంభవించాయి.
అటు గత కొద్దిరోజులుగా దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్యలో పెరుగుదల లేకపోవడం ఊరటను ఇచ్చే అంశం. అన్ని రాష్ట్రాల్లోనూ రికవరీ రేటు పెరుగుతోందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నిన్న 26,895 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో మంగళవారం 10,98,164 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా.. మొత్తం నిర్ధారణ పరీక్షల సంఖ్య 16,42,68,721కి చేరుకుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రియాశీల కేసులు 2.86 శాతానికి తగ్గాయి. మరణాలు రేటు 1.45 శాతానికి తగ్గింది. దేశంలో 95.69 శాతానికి రికవరీ రేటుకు చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
Also Read:
‘స్ట్రెయిన్’ వైరస్ వ్యాప్తిపై కేంద్రం క్లారిటీ.. ఒక్క కేసు కూడా నమోదు కాలేదని స్పష్టత..!
ఏపీ వాహనదారులకు అలెర్ట్.. జనవరి 1 నుంచి చలానాల బాదుడు షురూ.. లైట్ తీసుకుంటే ఇక అంతే.!
ఆన్‌లైన్ కాల్‌మనీపై సీఎం జగన్ సీరియస్.. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు..
‘సీబీఎస్‌సీ’ 10, 12వ తరగతుల బోర్డు పరీక్షలు వాయిదా.. కేంద్రమంత్రి కీలక ప్రకటన..!




