Coolie No 1 movie review: క్రిస్మస్ కానుకగా విడుదలైన వరుణ్ ధావన్ ‘కూలీ నెం. 1’..ప్రేక్షకులను ఎంతమేర అలరించింది..?
వరుణ్ ధావన్, సారా అలీ ఖాన్, పరేష్ రావల్, జావేద్ జాఫేరి తదితరులు నటించిన కూలీ నెం 1 సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో క్రిస్మస్ కానుకగా విడుదలైంది.
వరుణ్ ధావన్, సారా అలీ ఖాన్, పరేష్ రావల్, జావేద్ జాఫేరి తదితరులు నటించిన కూలీ నెం 1 సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో క్రిస్మస్ కానుకగా విడుదలైంది. ఈ చిత్రం డేవిడ్ ధావన్ దర్శకత్వం వహించిన 45 వ సినిమా కావడం విశేషం. గోవింద, కరిష్మా కపూర్ హీరోహీరోయిన్లుగా 1995లో వచ్చిన ‘కూలీ నెం. 1’కు ఇది రీమేక్‌గా తెరకెక్కింది. ఇక చిత్రానికి మిశ్రమ స్పందన లభిస్తోంది. 1995 సినిమా కథాంశాన్ని తీసుకుని ఇప్పటి తరాలకు అనుగుణంగా దర్శకుడు చక్కగా మలిచినట్టు సినిమా చూసిన వీక్షకులు చెబుతున్నారు. మారుతున్న సినిమా సెన్సిబిలిటీలను పక్కన పెట్టి, కామిక్ కంటెంట్‌ను రాబట్టడంపైనే అతడు ఫోకస్ పెట్టినట్లు చెబుతున్నారు. కదర్ ఖాన్, శక్తి కపూర్, డేవిడ్ ధావన్ సహాయక పాత్రల్లో అదరగొట్టారన్న టాక్ వినిపిస్తోంది.
కొత్త వైన్‌ను పాత సిసాలో అంతే కిక్‌తో మేకర్స్ నింపారని ప్రేక్షకులు చెబుతున్నారు. కరీష్మా కపూర్ సారా అలీ ఖాన్ పాత్రలో… వరుణ్ ధావన్ గోవింద పాత్రలో అద్బుత ప్రదర్శన చేశారన్న ప్రశంసలు దక్కుతున్నాయి. పరేష్ రావల్, రాజ్‌పాల్ యాదవ్, జానీ లివర్, అనిల్ ధావన్‌లతో సహా ప్రతిభావంతులైన సహాయక తారాగణం ఉన్నప్పటికీ, వారిని సరిగా వాడుకోలేదన్న వాదన వినిపిస్తోంది. అయితే, కొన్ని డైలాగ్స్ గోవింద-కరిష్మా కపూర్ సినిమా నుంచి యాజిటీజ్ దించారని తెలుస్తోంది. కాస్త రిచ్ లొకేషన్స్ లో షూట్ చేశారు తప్పితే..ఆ సినిమాకు.. ఈ సినిమాకు తేడా ఏం లేదన్నది మరికొందరి మాట. ఇక యాస, బాడీ షేమింగ్‌పై కూడా కాస్త మితిమీరి జోకులు వేశారని నెటిజన్లు అంటున్నారు. సినిమాపై ఇంట్రస్ట్ పెంచడానికి అసలు చిత్రం నుండి ‘హుస్న్ హై సుహానా’, ‘తుజ్కో మిర్చి లాగి’లను యాజిటీజ్ దించేశారు. మిగిలిన రెండు పాటలు- ‘తేరి భాభి’ , ‘మమ్మీ కసం’ ఓకే అనిపించాయి కానీ నిలిచిపోయేవి మాత్రం కాదు. మొత్తానికి సినిమా సో..సో..వీలైతే ఒకసారి ఓకే అంటున్నారు.
Also Read :
Tadipatri fight : తాడిపత్రిలో హై అలర్ట్..అన్ని సెంటర్లలోనూ పికెటింగ్..నేడు కేసులు నమోదు చేసే ఛాన్స్
Variety marriage : వధువు పెళ్లి వద్దని వెళ్లిపోయింది…అతిథిలా వచ్చిన అమ్మాయి పెళ్లికూతురైంది
Drunk And Drive Tests : మందుబాబులకు హెచ్చరిక..నేటి నుంచి నగరంలో డ్రంక్ అండ్ టెస్టులు షురూ