గ్రేటర్ పదవికి రాజీనామా చేశాను, నాకు ప్రమోషన్ కావాలి, కాంగ్రెస్ కు పూర్వవైభవాన్ని తెస్తాను: అంజన్ కుమార్ యాదవ్

కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్ష పదవికి అంజన్ కుమార్ యాదవ్ రాజీనామా చేశారు. "ఇప్పటివరకూ కాంగ్రెస్ గ్రేటర్ అధ్యక్షుడ్ని నేనే.. కాకపోతే నాకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదు...

గ్రేటర్ పదవికి రాజీనామా చేశాను, నాకు ప్రమోషన్ కావాలి,  కాంగ్రెస్ కు పూర్వవైభవాన్ని తెస్తాను: అంజన్ కుమార్ యాదవ్
Follow us
Venkata Narayana

|

Updated on: Dec 10, 2020 | 6:22 PM

కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్ష పదవికి అంజన్ కుమార్ యాదవ్ రాజీనామా చేశారు. “ఇప్పటివరకూ కాంగ్రెస్ గ్రేటర్ అధ్యక్షుడ్ని నేనే.. కాకపోతే నాకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదు. ఏరియాకు ఒక అధ్యక్షుడు కనిపిస్తున్నాడు సిటీలో. ఈసారి టిపిసిసి అధ్యక్ష పదవి బీసీలకు ఇవ్వాలి. నేను ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ కి లాయల్ గా పనిచేస్తున్నాను. నాకు ఇవ్వడంలో తప్పు లేదు. అందరినీ కలుపుకొని కాంగ్రెస్ కు పూర్వవైభవాన్ని తెస్తాను.” అని టీవీ9తో అంజన్ కుమార్ యాదవ్ చెప్పారు. పార్టీ అధిష్టానం తనకు టిపిసిసి ఇస్తే సమర్థవంతంగా పని చేస్తానని ధీమా వ్యక్తం చేశారు. “నేను గ్రేటర్ పదవికి మాత్రమే రాజీనామా చేశాను. నాకు ప్రమోషన్ కావాలి”. అని అంజన్ కుమార్ యాదవ్ వెల్లడించారు.