బడ్జెట్ 2020 ఎఫెక్ట్: భారీగా ధరలు పెరిగేవి.. తగ్గేవి.. ఇవే!

Central Budget 2020-21: కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ 2020-21 సంవత్సరానికి గానూ పార్లమెంటులో యూనియన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇక ఈ బడ్జెట్ ఆశాజనకంగా ఉందని చెప్పాలి. దేశం ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్య, ద్రవ్యోల్బణం, ఆదాయ అసమానతలు, మందగమనంలో సాగుతున్న ఆర్థిక వృద్ది రేటు.. ఇలా.. పలు సవాళ్లు బడ్జెట్ మీద నీలినీడలు పరిచినా.. అందరికి ఆమోదభాగ్యంగానే కేంద్రం బడ్జెట్‌ను సమర్పించింది. ఈ బడ్జెట్‌లో కస్టమ్స్ డ్యూటీ పెంపును ప్రస్తావించడంతో ఫర్నీచర్, చెప్పులు ధరలు పెరగనున్నాయి. […]

బడ్జెట్ 2020 ఎఫెక్ట్: భారీగా ధరలు పెరిగేవి.. తగ్గేవి.. ఇవే!
Follow us
Ravi Kiran

|

Updated on: Feb 02, 2020 | 5:54 AM

Central Budget 2020-21: కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ 2020-21 సంవత్సరానికి గానూ పార్లమెంటులో యూనియన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇక ఈ బడ్జెట్ ఆశాజనకంగా ఉందని చెప్పాలి. దేశం ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్య, ద్రవ్యోల్బణం, ఆదాయ అసమానతలు, మందగమనంలో సాగుతున్న ఆర్థిక వృద్ది రేటు.. ఇలా.. పలు సవాళ్లు బడ్జెట్ మీద నీలినీడలు పరిచినా.. అందరికి ఆమోదభాగ్యంగానే కేంద్రం బడ్జెట్‌ను సమర్పించింది.

ఈ బడ్జెట్‌లో కస్టమ్స్ డ్యూటీ పెంపును ప్రస్తావించడంతో ఫర్నీచర్, చెప్పులు ధరలు పెరగనున్నాయి. అలాగే ఎ​క్సైజ్‌ డ్యూటీ పెంపు కారణంగా సిగరెట్లు, పొగాకు ఉత్పత్తుల ధరలు కూడా పెరుగుతాయి. అటు ఎలక్ట్రికల్ వాహనాలు, మొబైల్ ఫోన్ల విడిభాగాలపై కేంద్రం పన్ను తగ్గించింది… అంతేకాకుండా విదేశాల నుంచి దిగుమతి చేస్తున్న న్యూస్ ప్రింట్‌పై కూడా పన్నును తగ్గించారు. ఇక వైద్య పరికరాలపై 5 శాతం కస్టమ్స్ సుంకాన్ని పెంచింది. కాగా, స్కిమ్డ్‌ మిల్క్‌ ధరలు కూడా పెరగనున్నాయి. దీనితో బడ్జెట్ కారణంగా ధరలు తగ్గేవి, పెరిగేవి ఏవో ఇప్పుడు చూద్దాం..

ధరలు పెరిగే వస్తువులు…

  • ఫర్నీచర్‌
  • చెప్పులు
  • సిగరెట్లు
  • పొగాకు ఉత్పత్తులువైద్య పరికరాలు
  • కిచెన్‌లో వాడే వస్తువులు
  • క్లే ఐరన్‌
  • స్టీలు
  • కాపర్‌
  • సోయా ఫైబర్‌, సోయా ప్రోటీన్‌
  • కమర్షియల్‌ వాహనాల విడిభాగాలు
  • స్కిమ్డ్‌ మిల్క్‌
  • వాల్‌ ఫ్యాన్స్‌
  • టేబుల్‌వేర్

తగ్గే వస్తువులు ఇవి..

  • విదేశాల నుంచి దిగుమతి చేసుకునే న్యూస్‌ ప్రింట్‌
  • ఎలక్ట్రిక్‌ వాహనాలు
  • మొబైల్‌ ఫోన్ల విడిభాగాలు
  • ప్లాస్టిక్‌ ఆధారిత ముడి సరుకు