స్టేజ్ మీదే కన్నుమూసిన కమెడియన్..నటనే అనుకున్న ఆడియెన్స్

స్టేజ్ మీదే కన్నుమూసిన కమెడియన్..నటనే అనుకున్న ఆడియెన్స్

భారత సంతతికి చెందిన ప్ర‌ముఖ స్టాండప్ కమెడియన్ మంజునాథ్‌ నాయుడు(36) దుబాయ్‌లోని ఓ హోట‌ల్‌లో ప్రదర్శన ఇస్తుండ‌గా, తీవ్ర గుండెపోటు రావ‌డంతో స్టేజ్‌పైనే కుప్ప‌కులాడు. యాక్ట్‌లో భాగంగానే ఆయ‌న అలా చేస్తున్నాడ‌ని ప్రేక్ష‌కులు, నిర్వాహ‌కులు భావించి ఆసుప‌త్రికి తీసుకెళ్ల‌డంలో ఆల‌స్యం చేయ‌డంతో క‌న్నుమూశారు. అబుదాబిలో జ‌న్మించిన మంజునాథ్ దుబాయ్ లో స్థిర‌ప‌డ్డాడు. ఓ ఈవెంట్‌లో భాగంగా ప‌లు స్టోరీస్ చెబుతూ ప్రేక్ష‌కుల‌ని న‌వ్విస్తున్నాడు. త‌న తండ్రి, ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ.. వారితో ఉన్నప్పుడు ఎలాంటి ఒత్తిడిని ఎదుర్కుంటాడో […]

Ram Naramaneni

|

Jul 21, 2019 | 1:08 PM

భారత సంతతికి చెందిన ప్ర‌ముఖ స్టాండప్ కమెడియన్ మంజునాథ్‌ నాయుడు(36) దుబాయ్‌లోని ఓ హోట‌ల్‌లో ప్రదర్శన ఇస్తుండ‌గా, తీవ్ర గుండెపోటు రావ‌డంతో స్టేజ్‌పైనే కుప్ప‌కులాడు. యాక్ట్‌లో భాగంగానే ఆయ‌న అలా చేస్తున్నాడ‌ని ప్రేక్ష‌కులు, నిర్వాహ‌కులు భావించి ఆసుప‌త్రికి తీసుకెళ్ల‌డంలో ఆల‌స్యం చేయ‌డంతో క‌న్నుమూశారు.

అబుదాబిలో జ‌న్మించిన మంజునాథ్ దుబాయ్ లో స్థిర‌ప‌డ్డాడు. ఓ ఈవెంట్‌లో భాగంగా ప‌లు స్టోరీస్ చెబుతూ ప్రేక్ష‌కుల‌ని న‌వ్విస్తున్నాడు. త‌న తండ్రి, ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ.. వారితో ఉన్నప్పుడు ఎలాంటి ఒత్తిడిని ఎదుర్కుంటాడో చెప్పసాగాడు. త‌న స్టోరీ ప్రారంభించిన మొదటి నిమిషంలోనే  ఒక్క‌సారిగా కుప్ప‌కూలిపోయాడు. శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బంది ప‌డ‌డంతో మంజునాథ్ మ‌ర‌ణించి ఉంటాడ‌ని డాక్ట‌ర్స్ పేర్కొన్నారు. కాగా అతని పేరెంట్స్ గతంలోనే మరణించగా..సోదరుడు మాత్రమే ఉన్నాడు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu