Consumer Forum Fine: 150 గ్రా. కోల్గెట్ పేస్ట్‌ను రూ.17 ఎక్కువుగా అమ్ముతున్నందుకు కన్స్యూమర్ కోర్ట్‌లో కేసు.. రూ.66వేలు ఫైన్

సమాజంలో తమకు జరుగుతున్న అన్యాయం పై పోరాడేవారు కొంతమంది ఉంటారు. తమ భాద్యతలను నిర్వహిస్తూ.. హక్కుల కోసం ఎంతవరకైనా పోరాడతారు. తాజాగా సంగారెడ్డి కి చెందిన...

Consumer Forum Fine: 150 గ్రా. కోల్గెట్ పేస్ట్‌ను రూ.17 ఎక్కువుగా అమ్ముతున్నందుకు కన్స్యూమర్ కోర్ట్‌లో కేసు.. రూ.66వేలు ఫైన్
Follow us
Surya Kala

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 23, 2021 | 11:00 AM

Consumer Forum Fine: సమాజంలో తమకు జరుగుతున్న అన్యాయం పై పోరాడేవారు కొంతమంది ఉంటారు. తమ భాద్యతలను నిర్వహిస్తూ.. హక్కుల కోసం ఎంతవరకైనా పోరాడతారు. తాజాగా సంగారెడ్డి కి చెందిన ఓ వినియోగదారుడు కోల్గేట్‌ సంస్థ పేస్టును అధిక ధరకు విక్రయిస్తున్నారని వినియోగదారుల ఫోరం లో పిటిషన్ దాఖలు చేశాడు. ఆ పిటిషన్ ను విచారించిన వినియోగదారుల ఫోరమ్ రూ.65 వేల జరిమానా విధించింది. ఈ పిటిషన్ ను విచారించి శుక్రవారం ఫోరం తీర్పునిచ్చింది.

‌ 2019 ఏప్రిల్‌ 7వ తేదీన సంగారెడ్డిలోని రిలయన్స్‌ ఫ్రెష్‌ రిటైల్‌ మాల్‌లో లాయర్ సీహెచ్‌ నాగేందర్ 150 గ్రాముల కోల్గేట్‌ మాక్స్‌ టూత్‌ పేస్ట్‌ రూ.92కు కొన్నారు. దీంతోపాటు 20 గ్రాముల కోల్గోట్‌ మాక్స్‌ టూత్‌పే‌స్ట్ రూ.10కి కొనుగోలు చేశారు. అయితే రూ.పదికి 20 గ్రాముల చొప్పున కొనుగోలు చేస్తే 150 గ్రాములకు రూ.75 అవుతుంది. కానీ 150 గ్రాముల పేస్ట్‌కు రూ.92 తీసుకోవడంపై నాగేందర్‌ సందేహం వ్యక్తం చేశారు. అంటే రూ.17 అధికంగా తీసుకుంటున్నారని గుర్తించారు. అధికంగా ఎందుకు తీసుకుంటున్నారంటూ ఆయన కోల్గేట్‌ సంస్థకు నోటీసులు పంపించారు.

లాయర్ నాగేందర్ నోటీసులకు కోల్గేట్‌ సంస్థ స్పందించలేదు. దీంతో ఆయన సంగారెడ్డిలోని వినియోగదారుల ఫోరమ్‌ను ఆశ్రయించారు. అతడి పిటిషన్‌ను విచారించి కోల్గేట్‌ సంస్థ అదనంగా వసూలు చేసిన రూ.17 తిరిగి ఇవ్వాలని వినియోగదారుల ఫోరం తీర్పు ఇచ్చింది. అంతేకాదు ఆయనను మానసిక క్షోభకు గురిచేసినందుకు రూ.10 వేలు, ఖర్చుల కింద రూ.5వేలు అదనంగా ఇవ్వాలని ఆదేశించింది. వినియోగదారుల సంక్షేమ నిధికి అదనంగా రూ. 50 వేలు ఇవ్వాలని కోల్గేట్‌ సంస్థను ఆదేశించారు. అయితే ఇవన్నీ కూడా నెల రోజుల్లోపు వినియోగదారుడు నాగేందర్‌కు చెల్లించాలని స్పష్టం చేసింది.

కొన్ని రోజుల క్రితం గుజరాత్ లో రూ.20 వాటర్ బాటిల్‌కు రూ.164 బిల్ వేసిన రెస్టారెంట్ పై రోహిత్ అనే వ్యక్తం ఐదేళ్లు పోరాటం గెలిచిన సంగతి తెలిసిందే.. మనం కొనే వస్తువులకు టాక్స్ పే చేస్తున్నాం.. కనుక ఎమ్మార్ఫీ కంటే అదనంగా మనం ఎందుకు ఇవ్వాలని అని వినియోగదారులు తన హక్కును గుర్తించి వినియోగదారుల ఫోరమ్ ని ఆశ్రయిస్తే.. ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది.

Also Read: మన గోదావరిలో అడుగు పెట్టిన విదేశాల్లో ఎక్కువగా కనిపించే జీబ్రా గీతల ఎలుక మూతి చేప