అమెరికాలో బిజీ బిజీగా సీఎం జగన్.. పలువురితో భేటీ
అమెరికా పర్యటనలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా యూఎస్ విదేశాంగ శాఖ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. హైదరాబాద్ కాన్సులేట్ కొత్త జనరల్ జోయల్ రిచర్డ్.. మధ్య, దక్షిణాసియా వ్యవహారాల ఉప మంత్రి థామస్ వాజ్దా.. ప్రభుత్వ వ్యవహారాల డైరక్టర్ క్లాడియా లిలైవ్‌ఫీల్డ్‌తో జగన్ భేటీ అయ్యి పలు అంశాలపై చర్చించారు. అలాగే గ్లోబల్ సస్టైనబిలిటీ వైస్ ప్రెసిడెంట్ క్లోనెక్లర్‌తోనూ భేటీ అయి రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించారు. […]
అమెరికా పర్యటనలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా యూఎస్ విదేశాంగ శాఖ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. హైదరాబాద్ కాన్సులేట్ కొత్త జనరల్ జోయల్ రిచర్డ్.. మధ్య, దక్షిణాసియా వ్యవహారాల ఉప మంత్రి థామస్ వాజ్దా.. ప్రభుత్వ వ్యవహారాల డైరక్టర్ క్లాడియా లిలైవ్‌ఫీల్డ్‌తో జగన్ భేటీ అయ్యి పలు అంశాలపై చర్చించారు.
అలాగే గ్లోబల్ సస్టైనబిలిటీ వైస్ ప్రెసిడెంట్ క్లోనెక్లర్‌తోనూ భేటీ అయి రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించారు. వీరితో పాటు సోలార్ పవర్, ఉపకరణాల తయారీ ప్రముఖ సంస్థ జాన్స్ కంట్రోల్స్ ప్రతినిధులతో సీఎం చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో స్మార్ట్ సిటీ నిర్మాణంలో సహకారం అందిస్తామని జాన్సన్ కంట్రోల్స్ ప్రతినిధులు తెలిపారు. పట్టణాభివృద్ధి, జల నిర్వహణలో సహకారం అందించేందుకు సిద్ధమని జిలీడ్ సైస్సెస్ వెల్లడించారు. ఈ సందర్భంగా వ్యవసాయ పరిశోధనలో ఏపీకి సహకరిస్తామని జీలీడ్ సైన్సెస్ సభ్యులు పేర్కొన్నారు.