నా భార్య ఉగ్రవాది… అంటూ పోలీసులకు ఫోన్

విదేశాలకు వెళ్తున్న భార్యను ఆపేందుకు ఓ వ్యక్తి చేసిన పని పోలీసులను కంగారుపెట్టించింది. చివరకు నిజం తెలియడంతో అతడు కటకటాల పాలయ్యాడు. వివరాల్లోకెళితే… ఆగస్టు 8న ఢిల్లీ పోలీసు స్పెషల్‌ సెల్‌కు ఓ ఫోన్‌ కాల్‌ వచ్చింది. ఓ ఆగంతకుడు ఫోన్‌ చేసి తన భార్య ఫిదాయిన్‌(ఆత్మహుతి దాడికి పాల్పడే ఉగ్రవాది) అని, ఢిల్లీ ఎయిర్‌పోర్టులో బాంబు పెట్టేందుకు వెళ్తున్నట్లు చెప్పాడు. దుబాయి లేదా సౌదీ అరేబియా వెళ్లే విమానాన్ని పేల్చేసేందుకు ఆమె యత్నిస్తున్నట్లు తెలిపాడు. అప్రమత్తమైన […]

నా భార్య ఉగ్రవాది... అంటూ పోలీసులకు ఫోన్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 17, 2019 | 5:42 PM

విదేశాలకు వెళ్తున్న భార్యను ఆపేందుకు ఓ వ్యక్తి చేసిన పని పోలీసులను కంగారుపెట్టించింది. చివరకు నిజం తెలియడంతో అతడు కటకటాల పాలయ్యాడు. వివరాల్లోకెళితే… ఆగస్టు 8న ఢిల్లీ పోలీసు స్పెషల్‌ సెల్‌కు ఓ ఫోన్‌ కాల్‌ వచ్చింది. ఓ ఆగంతకుడు ఫోన్‌ చేసి తన భార్య ఫిదాయిన్‌(ఆత్మహుతి దాడికి పాల్పడే ఉగ్రవాది) అని, ఢిల్లీ ఎయిర్‌పోర్టులో బాంబు పెట్టేందుకు వెళ్తున్నట్లు చెప్పాడు. దుబాయి లేదా సౌదీ అరేబియా వెళ్లే విమానాన్ని పేల్చేసేందుకు ఆమె యత్నిస్తున్నట్లు తెలిపాడు. అప్రమత్తమైన పోలీసులు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులకు సమాచారమిచ్చారు. ఎయిర్‌పోర్టు సిబ్బంది వెంటనే అంతర్జాతీయ విమానాల రాకపోకలను నిలిపివేసి తనిఖీలు చేపట్టగా.. ఎలాంటి బాంబులు లభ్యం కాలేదు. దీంతో ఆ ఫోన్‌కాల్‌ పై విచారణ జరిపిన పోలీసులు నిజం తెలిసి కంగుతిన్నారు. భార్య విదేశాలకు వెళ్లకుండా ఆపేందుకు ఓ వ్యక్తి ఈ ఫోన్‌ కాల్‌ చేసినట్లు దర్యాప్తులో తేలింది.

చెన్నైలో ఓ బ్యాగుల తయారీ సంస్థ యజమాని అయిన నజీరుద్దీన్‌ తన దగ్గర పనిచేసే రఫియా అనే యువతిని కొన్నేళ్ల కిందట వివాహం చేసుకున్నాడు. ఇటీవల రఫియా గల్ఫ్‌కు వెళ్లి ఉద్యోగం చేయాలని నిర్ణయించుకుని అందుకు ప్రయాణమైంది. అయితే భార్య తనను విడిచి విదేశాలకు వెళ్లడం ఇష్టం లేని నజీరుద్దీన్‌ ఎలాగైనా ఆమెను ఆపాలని ఓ పథకం పన్నాడు. ఇందులో భాగంగానే ఆమె ఉగ్రవాది అంటూ పోలీసులకు ఫోన్‌ చేశాడు. అతడి ప్రయత్నం బెడిసికొట్టి చివరకు జైలుపాలయ్యాడు.