AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సర్పంచులకు సీఎం కేసీఆర్ షాక్..రంగంలోకి ఫ్లయింగ్ స్క్వాడ్స్

పల్లె ప్రగతి కార్యక్రమాలు ఎంతమేర జనంలోకి వెళ్లాయో తెలుసుకునేందుకు సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జనవరి 1 నుంచి ఫ్లయింగ్ స్క్వాడ్స్ రంగలోకి దిగనున్నాయి. రాష్ట్రం మొత్తంలో పల్లె ప్రగతి కార్యక్రమాల పురోగతి, వాటి నాణ్యతపై ఈ స్క్వాడ్స్ అకస్మిక  తనిఖీచేసి  ప్రభుత్వానికి నివేదికలు సమర్పించనున్నాయని సీఎం ప్రకటించారు. పల్లె ప్రగతి కార్యక్రమంపై సీఎం ఆదివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. పల్లెలను ప్రగతి పథంపైపు తీసుకెళ్లడమే లక్ష్యంగా 30 రోజుల గ్రామ […]

సర్పంచులకు సీఎం కేసీఆర్ షాక్..రంగంలోకి ఫ్లయింగ్ స్క్వాడ్స్
Ram Naramaneni
|

Updated on: Dec 23, 2019 | 8:33 AM

Share

ల్లె ప్రగతి కార్యక్రమాలు ఎంతమేర జనంలోకి వెళ్లాయో తెలుసుకునేందుకు సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జనవరి 1 నుంచి ఫ్లయింగ్ స్క్వాడ్స్ రంగలోకి దిగనున్నాయి. రాష్ట్రం మొత్తంలో పల్లె ప్రగతి కార్యక్రమాల పురోగతి, వాటి నాణ్యతపై ఈ స్క్వాడ్స్ అకస్మిక  తనిఖీచేసి  ప్రభుత్వానికి నివేదికలు సమర్పించనున్నాయని సీఎం ప్రకటించారు. పల్లె ప్రగతి కార్యక్రమంపై సీఎం ఆదివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. పల్లెలను ప్రగతి పథంపైపు తీసుకెళ్లడమే లక్ష్యంగా 30 రోజుల గ్రామ ప్రణాళికను రచించామని..ప్రజలు ఇందులో పాలుపంచుకోవడం శుభపరిణామన్నారు. ప్రభుత్వం సెప్టెంబర్ తీసుకొచ్చిన కార్యక్రమానికి  మంచి జనాదరణ లభిస్తోందని పేర్కొన్నారు.

అయితే అధికారులు, ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంపై అశ్రద్ద చూపిస్తుండటంపై సీఎం అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు క్షేత్ర స్థాయి నుంచి కొన్ని నివేదికలు అందాయని తెలిపారు. ప్లయింగ్ స్క్వాడ్స్ చేసే ఫలితాల ద్వారా దిద్దుబాటు చర్యలు చేపట్టమే కాకుండా, నూరు శాతం ఫలాలు పొందే అవకాశం ఉంటుదన్నారు. ఐఏఎస్, ఐపిఎస్, ఐఎఫ్ఎస్, మూడు క్యాడర్లకు సంబంధించిన అధికారులను నియమించి..పల్లె ప్రగతి కార్యక్రమాలను మోనిటరింగ్ చేయనున్నట్లు  పేర్కొన్నారు. విడుతల వారీగా తనిఖీల కార్యక్రమం ఉంటుందని..పనుల్లో అలసత్వం వహించిన పంచాయితీరాజ్ అధికారులు, సర్పంచులపై కఠిన చర్యలు ఉంటాయని సీఎం తెలిపారు. కాగా తనిఖీల్లో పాల్గొనే ప్రతి అధికారికి  జిల్లాల్లోని 12 మండలాల చొప్పున రాండమ్‌గా బాధ్యతను అప్పగించనుంది ప్రభుత్వం. అయితే ఏ మండలం ఎవరికి కేటాయిస్తున్నారే అనే అంశంపై గోప్యత వహించనుంది. ప్రారంభంలో చెప్పినట్టుగానే, ప్రతి నెలా గ్రామాల డెవలప్‌మెంట్ కోసం రూ.339 కోట్లు విడుదల చేస్తోంది గవర్నమెంట్.  కాగా తెలంగాణలోని ప్రతి గ్రామాన్ని అద్దంలా, అద్భుతంగా తీర్చిదిద్దే వరకు విశ్రమించదని లేదని సీఎం ఈ సందర్భంగా తేల్చి చెప్పారు.