Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇద్దరూ మిత్రులే కానీ.. ఇది ఊహించి ఉండరు..!

తెలంగాణలో కేసీఆర్, ఆంధ్రాలో జగన్మోహన్‌రెడ్డి బంఫర్ మెజార్టీతో సీఎంలుగా విజయం సాధించారు. ఆ తర్వాత కాలంలో ఇరువురు ఒక తాటిపై నిలబడుతూ..రాష్ట్రాల అభివృద్ధి విషయంలో పంపకాలు, ప్రాజెక్టులు సహా పలు విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వీటిపై ఇరు రాష్ట్రాల ప్రజలు హర్షించారు. కానీ జగన్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు కేసీఆర్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. గతంలో ఎన్నడూ లేనంత బ్యాడ్ నేమ్‌ను తాజాగా సీఎం కేసీఆర్ ఫేస్ చేస్తున్నారు. ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం దిశగా […]

ఇద్దరూ మిత్రులే కానీ.. ఇది ఊహించి ఉండరు..!
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 15, 2019 | 6:06 AM

తెలంగాణలో కేసీఆర్, ఆంధ్రాలో జగన్మోహన్‌రెడ్డి బంఫర్ మెజార్టీతో సీఎంలుగా విజయం సాధించారు. ఆ తర్వాత కాలంలో ఇరువురు ఒక తాటిపై నిలబడుతూ..రాష్ట్రాల అభివృద్ధి విషయంలో పంపకాలు, ప్రాజెక్టులు సహా పలు విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వీటిపై ఇరు రాష్ట్రాల ప్రజలు హర్షించారు. కానీ జగన్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు కేసీఆర్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. గతంలో ఎన్నడూ లేనంత బ్యాడ్ నేమ్‌ను తాజాగా సీఎం కేసీఆర్ ఫేస్ చేస్తున్నారు.

ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం దిశగా ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్దం చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో తమను కూాడా ప్రభుత్వంలో భాగం చెయ్యాలంటూ టీఎస్‌ఆర్టీసీ ఎంప్లాయిస్‌ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసారు. సీఎం ససేమేరా అనడంతో సమ్మెకు దిగారు. కానీ మంతనాలు, చర్చలతో ముగుస్తుందనుకున్న ఈ సమ్మె చాలా సీరియస్‌గా మారింది. ఇద్దరి ఉద్యోగుల బలవన్మరణాలతో పరిస్థితి చేయి దాటింది. ప్రభుత్వం ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది.

ఇక మరోవైపు ఏపీఎస్ఆర్టీసీ ని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియపై సీఎం జగన్ మోహన్ రెడ్డి సర్కారు తాజాగా కమిటీని ఏర్పాటు చేసింది. రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి చైర్మన్ గా మొత్తం ఆరుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఆర్టీసీ విలీనం, ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విలీనం ప్రక్రియలో మిగిలిన అంశాలపై అధ్యయనం చేసి కమిటీ నివేదిక ఇవ్వనుంది. మొత్తం 9 అంశాలపై అధ్యయనం చేసి కమిటీ నివేదిక ఇస్తుంది. ప్రజా రవాణా వ్యవస్థ ఏర్పాటుపై కూడా కమిటీ అవసరమైన సూచనలు చేయనుంది. శాశ్వత ఉద్యోగులు, తాత్కాలిక ఉద్యోగుల జీతభత్యాలపై కమిటీ రిపోర్ట్ ఇస్తుంది. విలీనం తర్వాత ఆర్టీసీ బిజినెస్ రూల్స్ లో మార్పులు రాకుండా తీసుకివాల్సిన చర్యలపై నివేదికను ఇవ్వనుంది. రిటైర్డ్ ఉద్యోగుల జీతాలు,వైద్య సదుపాయలపై అధికారుల కమిటీ పరిశీలన చేస్తుందని ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వం లో విలీనం చేయడంలో ఉన్న ఆర్ధిక,న్యాయపరమైన అంశాలపై నివేదిక ఇవ్వనున్నారు. వచ్చే నెలాఖరుకల్లా నివేదిక ఇవ్వాలని కమిటీ కి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న సమ్మె నేపథ్యంలో .. ఏపీఎస్ ఆర్టీసీ విలీనానికి సంబంధించి జగన్ మరో ముందడుగు వేయడం కేసీఆర్‌కు ఇబ్బందిగా మారింది. ఇది త్వరలోనే ముగిసిపోతే పర్లేదు గానీ..జాప్యం జరిగితే మాత్రం హుజూర్‌నగర్ ఉపఎన్నిక సమయంలో ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది. ఇలా సీఎం జగన్.. కేసీఆర్‌కు డైరెక్ట్‌గా మిత్రుడైనా..కానీ ఎంతోకొంత ఈ సమ్మెకు ఏపీ సీఎం ఇన్ డైరెక్ట్‌గా కారణం అన్న వాదనను కొందరు వ్యక్తం చేస్తున్నారు.