ట్రెడిషనల్ లుక్‌లో ఆదాశర్మ.. బ్యూటిఫుల్ ఫొటోస్ వైరల్
అందాల ముద్దుగుమ్మ ఆదా శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది. అయినా ఈ బ్యూటికి మాత్రం ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. దీంతో తెలుగు ఇండస్ట్రీకి దూరమైంది. తాజాగా ఈ బ్యూటీ లెహెంగాలో క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఈ పిక్స్ పై ఓ లుక్ వేయండి మరి!
Updated on: Apr 04, 2025 | 6:04 PM

బాలీవుడ్ చిన్నది ఆదా శర్మ అందానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. క్యూట్ లుక్స్ తో అందరినీ ఆకట్టుకుంటుంది ఈ బ్యూటీ. తన నటనతో మంచి మార్కులు సంపాదించినప్పటికీ, స్టార్ హీరోయిన్ స్టేటస్ మాత్రం అందుకోలేకపోయింది.

1920 అనే హారర్ మూవీతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ , అక్కడ పలు సినిమాలు చేసి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత హార్ట్ ఎటాక్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వసూలు చేయకపోయినప్పటికీ ఈ అమ్మడుకు మాత్రం మంచి క్రేజ్ వచ్చింది.

దీంతో తర్వాత పలు సినిమాల్లో అవకాశాలు రావడంతో వరసగా సినిమాలు చేస్తూ మంచి ఫేమ్ సంపాదించుకుంది. తర్వాత కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ ఎక్కడ ఆఫర్ వచ్చినా వచ్చిన ప్రతి ఛాన్స్ మిస్ చేసుకోకుండా సినిమాలు చేస్తూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.

ముఖ్యంగా కేరళ స్టోరీ అనే సినిమాతో దేశమంతటా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. ఈ సినిమాలో ఈ అమ్మడు నటనకు ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు.

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది తాజాగా ట్రెడిషనల్ లుక్ లో అందరినీ ఆకట్టుకుంది. తన వయ్యారాలను ఒలుకబోస్తూ అందంగా ఫొటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.



