అమెరికా బాటలో చైనా.. ఏం చేసిందంటే..

కరోనా దెబ్బకు చైనాను అన్ని దేశాలు దూరం పెడుతున్నాయి. ఇందులో భారత్, ఆస్ట్రేలియా, ఇప్పుడు అమెరికా కూడా చేరింది. దూరం పెట్టడమే కాదు డ్రాగన్ కంట్రీపై అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నాయి. ఇందులో భాగంగా టెక్సా్‌సలోని వైద్య పరిశోధనలతో పాటు ఇతర సమాచారాన్ని కూడా చైనా చోరీ చేస్తోందని ఆరోపిస్తూ.. హూస్టన్‌లోని చైనా దౌత్యకార్యాలయాన్ని మూసివేయాలని ఈ నెల 21న అమెరికా ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు చైనా కూడా తమ దేశంలోని చెంగ్డూలోని అమెరికా […]

  • Sanjay Kasula
  • Publish Date - 4:30 am, Sat, 25 July 20
అమెరికా బాటలో చైనా.. ఏం చేసిందంటే..

కరోనా దెబ్బకు చైనాను అన్ని దేశాలు దూరం పెడుతున్నాయి. ఇందులో భారత్, ఆస్ట్రేలియా, ఇప్పుడు అమెరికా కూడా చేరింది. దూరం పెట్టడమే కాదు డ్రాగన్ కంట్రీపై అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నాయి. ఇందులో భాగంగా టెక్సా్‌సలోని వైద్య పరిశోధనలతో పాటు ఇతర సమాచారాన్ని కూడా చైనా చోరీ చేస్తోందని ఆరోపిస్తూ.. హూస్టన్‌లోని చైనా దౌత్యకార్యాలయాన్ని మూసివేయాలని ఈ నెల 21న అమెరికా ఆదేశించిన సంగతి తెలిసిందే.

అయితే ఇప్పుడు చైనా కూడా తమ దేశంలోని చెంగ్డూలోని అమెరికా కార్యాలయాన్ని మూసివేయాలని అమెరికాకు చైనా శుక్రవారం స్పష్టం చేసింది. అమెరికా తప్పుడు నిర్ణయం తీసుకుందని, దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని చైనా వాషింగ్టన్‌ను కోరింది. అందుకు అమెరికా స్పందించని నేపథ్యంలో.. తాము ప్రస్తుతం తీసుకున్న చర్య న్యాయమైనదే కాక, అవసరమైనదని చైనా విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలు తిరిగి గాడిలో పడేందుకు అవసరమైన పరిస్థితుల్ని అమెరికా సృష్టించాలి  అని పేర్కొంది.