సుడాన్‌లో చెలరేగిన ఘర్షణలు.. 127 మంది మృతి

దక్షిణ సూడాన్‌లో చెలరేగిన ఘర్షణలు హింసాత్మకంగా మారాయి. పౌరులకు, సైనికులకు మధ్య చోటుచేసుకున్న ఈ ఘర్షణల్లో 127 మంది మరణించారు. సూడాన్‌లోని టోంజ్ నగరంలో ఈ ఘటన..

సుడాన్‌లో చెలరేగిన ఘర్షణలు.. 127 మంది మృతి
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 13, 2020 | 10:25 PM

దక్షిణ సూడాన్‌లో చెలరేగిన ఘర్షణలు హింసాత్మకంగా మారాయి. పౌరులకు, సైనికులకు మధ్య చోటుచేసుకున్న ఈ ఘర్షణల్లో 127 మంది మరణించారు. సూడాన్‌లోని టోంజ్ నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సైనికులు పౌరుల నుంచి ఆయుధాలను తీసుకునేందుకు ప్రయత్నించిన సమయంలో.. శనివారం నాడు ఈ ఘటన చోటుచేసుకుంది. ఆర్మీ ప్రతినిధి మేజర్ జనరల్ లుల్ రువై కోయాంగ్ బుధవారం నాడు ఈ విషయాన్ని తెలిపారు.

గత కొన్నేళ్లుగా.. సూడాన్‌ ప్రాంతంలో అంతర్యుద్ధం కారణంగా ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ క్రమంలోనే పలు సంఘాలు వారి సెక్యూరిటీ కోసం ఆయుధాలను అందజేశాయి. అయితే ఆయుధాలతో అక్కడి యువత ఆపరేషన్‌ చేపట్టడాన్ని తోంజ్‌ సైన్యం ఒప్పకోలేదు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ మొదలైందని ఆర్మీ అధికారి తెలిపారు.