ఏపీ రెయిన్ అలర్ట్ : మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు…

వాయువ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతంలో రేపు అల్పపీడనం ఏర్పడనుందని తెలిపారు.  దీని ప్రభావంతో రాగల 4 రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే...

ఏపీ రెయిన్ అలర్ట్ : మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు...
Follow us
Sanjay Kasula

| Edited By: Ravi Kiran

Updated on: Aug 14, 2020 | 1:01 AM

Heavy Rains in Andrapradesh : ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరో నాలుగు రోజుల పాటు ఇదే స్థాయిలో జోరు వాన పడే అవకాశం ఉందని తెలిపింది.  వాయువ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతంలో రేపు అల్పపీడనం ఏర్పడనుందని తెలిపారు.  దీని ప్రభావంతో రాగల 4 రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

తీరం వెంబడి గంటకు 45-55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, అలలు 3 నుండి 3.5 మీటర్ల ఎత్తు ఎగిసిపడే అవకాశముందని పేర్కొంది. సముద్రంలో అలలు భారీ ఎత్తున ఎగిసిపడే అవకాశం ఉందని అన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె. కన్నబాబు తెలిపారు. అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదన్నారు. విశాఖ, తూర్పు గోదావరి జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అన్నారు. రాష్ట్రంలో మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని  పేర్కొన్నారు.

ఆగష్టు 15, 16 రెండు రోజుల పాటు  విశాఖ, తూర్పు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. రాష్ట్రంలో మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశముంద అన్నారు.