రానా, మిహీకలకు అముల్ పాప ‘సూపర్ గిఫ్ట్’
రానా, మిహీకల యానిమేటెడ్ డూడుల్‌ను అమూల్ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో "# అముల్ టొపికల్: ది రానా-మిహీక 'షాదీ' ఇంటర్నెట్ సెన్సేషన్!" అనే క్యాప్షన్‌తో షేర్ చేసుకుంది.
రానా-మిహికా బజాజ్‌లకు అముల్ పాప స్పెషల్ గిఫ్ట్ ఇచ్చింది. వీరి వివాహ వేడుక ఐదు రోజుల పాటు అతి కొద్ది మందితో ఘనంగా జరిగింది. పెళ్లి వేడుకలోని ముఖ్యమైన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సెలబ్రిటీల నుండి, రానా అభిమానుల నుండి సోషల్ మీడియాలో ఈ జంటకి శుభాకాంక్షలు తెలిపారు. అయితే.. కొత్తగా పెళ్లి చేసుకున్న ఈ జంటకు డెయిరీ మిల్క్ బ్రాండ్ అముల్ ఇండియా నుండి స్పెషల్ గిఫ్ట్ లభించింది.
రానా, మిహీకల యానిమేటెడ్ డూడుల్‌ను అమూల్ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో “# అముల్ టొపికల్: ది రానా-మిహీక ‘షాదీ’ ఇంటర్నెట్ సెన్సేషన్!” అనే క్యాప్షన్‌తో షేర్ చేసుకుంది. అందులో వారి యానిమేటెడ్ వెర్షన్లు బ్రెడ్, బటర్‌ను ఒకరికొకరు తినిపించుకుంటున్నట్లుగా కార్టున్ వేశారు.
వారితో పాటు, అమూల్ బ్రాండ్ ఐకానిక్ మస్కట్ అముల్ బేబీ కూడా చీరలో నిలబడి బ్రెడ్, బటర్ ప్లేట్‌ను పట్టుకొని ఉండడం చూడవచ్చు. డెయిరీ బ్రాండ్ చిత్రంపై “దగ్గుబటర్లీ వెడ్డింగ్! రానా, యే ఖానా!” అని రాసి ఉంది. అముల్ నుండి వచ్చిన స్పెషల్ ట్వీట్‌కి రానా స్పందిస్తూ.. ఆ సంస్థకు “ధన్యవాదాలు” తెలిపారు.
అమూల్ తరచుగా మన దేశంలో జరిగే వివిధ సంఘటనలపై అందమైన, ఆసక్తికరమైన డూడుల్‌లను క్రియేట్ చేసి రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే… అముల్ చేస్తున్న డూడుల్ అందరిని ఆకట్టుకుంటోంది. ఆ మధ్య బిగ్ బి కరోనా నుంచి కోలుకున్నసందర్భంలోనూ ఇలాంటి ఓ కార్టున్ వేసింది.
#Amul Topical: The Rana- Miheeka ‘shaadi’ is an Internet sensation! pic.twitter.com/fhR7tcm3jD
— Amul.coop (@Amul_Coop) August 11, 2020