హైదరాబాద్‌వాసులకు హెచ్చరిక.. మరో 5 రోజుల పాటు జోరు వానలు

హైదరాబాద్‌వాసులకు హెచ్చరిక.. మరో 5 రోజుల పాటు జోరు వానలు

హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లో ఈదురు గాలులతోపాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీచేసింది. అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో రానున్న ఐదు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.

Sanjay Kasula

|

Aug 13, 2020 | 11:18 PM

తెలంగాణతోపాటు హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లో ఈదురు గాలులతోపాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీచేసింది.

అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో రానున్న ఐదు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. రేపు(శుక్రమవారం), (శనివారం)ఎల్లుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ముందస్తు హెచ్చరిక చేసింది.

దీంతో.. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్ జిల్లాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 15 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu