వరుడు క్రిస్టియన్.. వధువు ముస్లిం.. హిందూ సంప్రదాయంలో పెళ్లి!

అబ్బాయిది క్రైస్తవ మతం, అమ్మాయి ముస్లిం.. కానీ వారిద్దరు వివాహం చేసుకుంది హిందూ సంప్రదాయం ప్రకారం. రెండు వేర్వేరు మతాలకు చెందిన యువతీ యువకులు ప్రేమించుకొని తమ ఆచారాలకు భిన్నంగా మరో మతాచారం ప్రకారం పెళ్లి చేసుకోవడం విశేషమే.

వరుడు క్రిస్టియన్.. వధువు ముస్లిం.. హిందూ సంప్రదాయంలో పెళ్లి!
Follow us

| Edited By:

Updated on: Aug 10, 2020 | 5:13 PM

Christian man weds muslim woman in hindu tradition: అబ్బాయిది క్రైస్తవ మతం, అమ్మాయి ముస్లిం.. కానీ వారిద్దరు వివాహం చేసుకుంది హిందూ సంప్రదాయం ప్రకారం. రెండు వేర్వేరు మతాలకు చెందిన యువతీ యువకులు ప్రేమించుకొని తమ ఆచారాలకు భిన్నంగా మరో మతాచారం ప్రకారం పెళ్లి చేసుకోవడం విశేషమే. ఖమ్మం జిల్లా తల్లాడలో ఇలాంటి అరుదైన ఘటన చోటుచేసుకుంది. తల్లాడ మండలం అన్నారుగూడెం గ్రామానికి చెందిన కోపిల అనిల్ కుమార్ ఖమ్మంలో ఇంటర్ చదివాడు. ఆ సమయంలోనే ఖమ్మం అర్బన్ మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన షేక్ సోనీ అనే యువతితో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది.

ఇంటర్ తర్వాత ఆటో నడుపుతున్న అనిల్.. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న సోనీ పెళ్లాడాలని నిర్ణయించుకున్నారు. అయితే, అనిల్ క్రిస్టియన్, అమ్మాయి ముస్లిం కావడంతో షేక్ సోనీ కుటుంబ సభ్యులు పెళ్లికి ఒప్పుకోలేదు. వీరిద్దరూ క్రైస్తవ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోవాలి లేదా ఇస్లాం ఆచారాల ప్రకారం నిఖా చేసుకోవాలి. కానీ అందరికీ ఆదర్శంగా నిలవడం కోసం హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకొని ఒక్కటయ్యారు. ఆదివారం ఉదయం 9.49 గంటలకు వీరి పెళ్లి జరిగింది. అనిల్ కుటుంబ సభ్యుల సహకారంతో హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్న ఈ జంటను పలువురు అభినందిస్తున్నారు.

Read More:

గుడ్ న్యూస్: తెలంగాణ ఆస్పత్రుల్లో ఇక ఆర్‌టీ-పీసీఆర్‌ ద్వారా కరోనా టెస్ట్..!

తెలంగాణలో కొలువుల జాతర.. కార్మిక ఉపాధి కల్పన శాఖ కొత్త ప్లాన్‌..!