Largest Power Bank: ప్రపంచంలోనే అతి పెద్ద పవర్ బ్యాంక్.. ఒకేసారి 5 వేల ఫోన్లకు చార్జింగ్
Largest Power Bank: మీ ఫోన్‌లో చార్జింగ్(Phone Charging) అయిపోయిందా.. పవర్ బ్యాంక్ కూడా డెడ్ అయిందా.. చార్జ్ చేయడానికి ఇంట్లో కరెంటు కూడా లేదా... అయితే ఇదిగో మీసమస్యలకు సొల్యూషన్ దొరికేసింది..
Largest Power Bank: మీ ఫోన్‌లో చార్జింగ్(Phone Charging) అయిపోయిందా.. పవర్ బ్యాంక్ కూడా డెడ్ అయిందా.. చార్జ్ చేయడానికి ఇంట్లో కరెంటు కూడా లేదా… అయితే ఇదిగో మీసమస్యలకు సొల్యూషన్ దొరికేసింది. చైనా(China)కు చెందిన జెంగ్ అనే వ్యక్తి ఈ సెల్‌ఫోన్ చార్జింగ్ సమస్యలకు పరిష్కారం చూపించాడు. ప్రపంచంలోనే అతి పెద్ద పవర్ బ్యాంక్ తయారు చేశాడు. దీని కెపాసిటీ 2 కోట్ల 70 లక్షల AMH కెపాసిటీతో తయారు చేశాడు. ఇంత పెద్ద పవర్ బ్యాంకును ప్రపంచంలో ఎక్కడా చూసి ఉండరు. సాధారణంగా ఒక స్మార్ట్‌ఫోన్‌లో 4000 ఎంఏహెచ్ కెపాసిటీతో బ్యాటరీ ఉంటుంది.
అయితే ఈ పవర్ బ్యాంక్ 2 కోట్ల 70 లక్షల ఎంఏహెచ్ కెపాసిటీని కలిగి ఉండటంతో దీనికి ఒకేసారి 5000 ఫోన్లను చార్జ్ చేసుకోవచ్చు. ఫోన్లు, లాప్‌టాప్‌లతో పాటు ఎలక్ట్రిక్ స్కూటర్లకు కూడా ఈ పవర్ బ్యాంక్‌తో చార్జింగ్ చేయొచ్చు. అలాగే టీవీ, వాషింగ్ మెషిన్ లాంటివి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. మొత్తానికి ఎలక్ట్రిసిటీ అవసరం లేకుండా ఈ పవర్ బ్యాంక్‌ను ఉపయోగించుకునేలా జెంగ్ దీన్ని తయారు చేశాడు. దానికి సంబంధించిన వీడియోను జెంగ్ తన సోషల్‌మీడియా అకౌంట్‌లో షేర్ చేశాడు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
Also Read: