ఎవరిది తప్పు..? చైనా-భారత్ ఇష్యూపై .. అమెరికా నిఘా రిపోర్ట్

చైనా ఉద్దేశపూర్వకంగానే భారత్ ను రెచ్చగొట్టేందుకు బోర్డర్ లో అతిక్రమణలకు పాల్పడుతున్నట్టుందని అమెరికా నిఘా విభాగం తేల్చి చెప్పింది. పాంగాంగ్ సరస్సు దక్షిణ తీరాన్ని ఆక్రమించుకునేందుకు..

ఎవరిది తప్పు..? చైనా-భారత్ ఇష్యూపై .. అమెరికా నిఘా రిపోర్ట్
Follow us
Pardhasaradhi Peri

| Edited By: Team Veegam

Updated on: Sep 15, 2020 | 8:15 PM

చైనా ఉద్దేశపూర్వకంగానే భారత్ ను రెచ్చగొట్టేందుకు బోర్డర్ లో అతిక్రమణలకు పాల్పడుతున్నట్టుందని అమెరికా నిఘా విభాగం తేల్చి చెప్పింది. పాంగాంగ్ సరస్సు దక్షిణ తీరాన్ని ఆక్రమించుకునేందుకు చైనా బలగాలు యత్నిస్తున్నాయని వెల్లడించింది. పాంగాంగ్ సరస్సు దగ్గర భారత బలగాలతో జరిగిన ఘర్షణ అనంతరం, అక్కడి తమ కమాండర్ బలగాలను తీసుకుని వెనక్కి వచ్చేయడం పైనా చైనా మండిపడుతోందని అమెరికా నిఘా వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంలో భారత సైన్యం పోరాట పటిమ చూపడంతో ఎలాంటి భూ ఆక్రమణ జరగలేదని వివరించింది. జూన్ నెలలో గాల్వన్ లోయలో చైనా బలగాలతో ఘర్షణల తర్వాత భారత సైనికులు రాటుదేలినట్టు కనిపిస్తుందని అమెరికా నిఘా విభాగం సదరు నివేదికలో పేర్కొంది. భారత్ తో సరిహద్దు ప్రతిష్టంభన నెలకొన్న సమయంలో చైనా ఇటువంటి చర్యలకు దిగడం ఆశ్చర్యం కలిగిస్తోందని కూడా అభిప్రాయం వ్యక్తం చేసింది. అయితే, ఈ అంశంపై తాము బీజింగ్ వర్గాలకు చెప్పేదేమీలేదని.. చైనా తన కన్ను తానే పొడుచుకుంటుందని భావించలేమని పేర్కొంది.