హడలెత్తిస్తున్న కరోనా.. ఒకే రోజు 254 మందికి పైగా మృతి..!
కోవిడ్-19 (కరోనా వైరస్) రోజురోజుకీ విజృంభిస్తోంది. చైనాలో పుట్టిన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలన్నింటినీ గజగజలాడిస్తోంది. దీని పేరు చెప్తేనే చాలు.. అన్ని దేశాలు వణికిపోతున్నాయి. ఇప్పటికే వెయ్యిమందికి పైగా మృతిచెందిన విషయం తెలిసిందే. కాగా.. ఈ వైరస్ బారిన పడిన బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ప్రస్తుతం అరవై వేల మంది వరకు ఈ వైరస్ బారిన పడ్డట్టు తెలుస్తోంది. బుధవారం ఒక్కరోజే ఈ కరోనా బారిన పడి.. 254 మంది మరణించారు. ఒకేరోజులో […]
కోవిడ్-19 (కరోనా వైరస్) రోజురోజుకీ విజృంభిస్తోంది. చైనాలో పుట్టిన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలన్నింటినీ గజగజలాడిస్తోంది. దీని పేరు చెప్తేనే చాలు.. అన్ని దేశాలు వణికిపోతున్నాయి. ఇప్పటికే వెయ్యిమందికి పైగా మృతిచెందిన విషయం తెలిసిందే. కాగా.. ఈ వైరస్ బారిన పడిన బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ప్రస్తుతం అరవై వేల మంది వరకు ఈ వైరస్ బారిన పడ్డట్టు తెలుస్తోంది. బుధవారం ఒక్కరోజే ఈ కరోనా బారిన పడి.. 254 మంది మరణించారు. ఒకేరోజులో ఇంతమంది చనిపోవడం ఇదే తొలిసారి. దీంతో మృతుల సంఖ్య పదమూడు వందలకు పైగా చేరింది. వైరస్ సోకిన వారి సంఖ్య 59,804గా చైనా మీడియ వెల్లడించింది.
కరోనా వైరస్‌ను నిర్ధారించడానికి కొత్త పద్ధతితో చెక్ చేయించడం ద్వారా.. కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిందని.. ఇకపై వైరస్‌కు సంబంధించి ప్రాథమిక లక్షణాలు కనిపించినవారిని కూడా వైరస్ సోకినవారిగా పరిగణించనున్నట్టు అధికారులు తెలిపారు. వైరస్ నిర్ధారణ అయిన వారితో సమానంగా వారికి కూడా చికిత్స అందించానున్నట్లు తెలిపారు. అందుకోసమే ఈ ఈ మార్పులు చేశామన్నారు.