AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: నీచాతి నీచుడు వీడు.. దాగుడుమూతలు ఆడుకుందామని తీసుకెళ్లి..

రాను రాను సమాజంలో మానవత్వం మంటగలిసిపోతుంది. ఆడుకుందామని నమ్మించి పిలిచిన ఓ కామాంధుడు.. తొమ్మిదేళ్ల బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈ దారుణ ఘటన మెదక్ జిల్లా శివంపేట మండలంలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తంచేసిన గ్రామస్థులు.. ఇలాంటి నిచుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

Telangana: నీచాతి నీచుడు వీడు.. దాగుడుమూతలు ఆడుకుందామని తీసుకెళ్లి..
Crime News
P Shivteja
| Edited By: |

Updated on: Mar 11, 2026 | 4:06 PM

Share

రాను రాను సమాజంలో మానవత్వం మంటగలిసిపోతుంది. ఆడుకుందామని నమ్మించి పిలిచిన ఓ కామాంధుడు.. తొమ్మిదేళ్ల బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈ దారుణ ఘటన మెదక్ జిల్లా శివంపేట మండలంలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తంచేసిన గ్రామస్థులు.. ఇలాంటి నిచుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. వివరాల ప్రకారం.. శివంపేట మండలం సికింద్లాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన సర్కస్ చూడటానికి వెళ్తున్న తొమ్మిదేళ్ల బాలికను.. అదే గ్రామానికి చెందిన 20 ఏళ్ల చేగురి ఆంజనేయులు అడ్డగించాడు. పక్కింటి వాడే కదా అని ఆ చిన్నారి ఆగింది. దీంతో ఆమెతో మాటలను కలిపిన ఆంజనేయులు.. ఇద్దరం కలిసి దాగుడుమూతలు ఆడుకుందామని మభ్యపెట్టి ఆ బాలికను తన అమ్మమ్మ ఇంటి వైపు తీసుకెళ్లాడు. ఇలా ఆమెను ఎవరూ లేని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అనంతరం బాలికపై అత్యాచారయత్నం చేశాడు.. ఒంటిమీద ఉన్న దుస్తులు విప్పేందుకు ప్రయత్నించడంతో భయాందోళనకు గురైన ఆ చిన్నారి గట్టిగా కేకలు వేసింది. బాలిక అరుపులు విన్న స్థానికులు ఒక్కసారిగా అక్కడికి చేరుకోవడంతో.. నిందితుడు అక్కడి నుండి పారిపోవడానికి ప్రయత్నించాడు.

వెంటనే.. అప్రమత్తమైన గ్రామస్థులు వెంటాడి ఆంజనేయులును పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు.. సమాచారం అందుకున్న శివంపేట పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితుడు ఆంజనేయులుపై POCSO (పోక్సో) చట్టం కింద కేసు నమోదు చేశారు.

నిందితుడిని కోర్టులో హాజరుపరిచి, సంగారెడ్డి జైలుకు తరలించనున్నట్లు ఎస్ఐ మధుకర్ రెడ్డి వెల్లడించారు. చిన్నారుల పట్ల ఇలాంటి అకృత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.. ఇలా పలుచోట్ల వరుసగా జరుగుతున్న ఘటనలు పసిపిల్లల భద్రతపై ఆందోళన కలిగిస్తున్నాయి. మరో వైపు ఈ నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఛీ..ఛీ నువ్వు మనిషివేనారా..? దాగుడుమూతలు ఆడుకుందామని తీసుకెళ్లి..
ఛీ..ఛీ నువ్వు మనిషివేనారా..? దాగుడుమూతలు ఆడుకుందామని తీసుకెళ్లి..
తెలంగాణలో తొలి హైటెక్ హైవే.. ప్రారంభానికి డేట్ ఫిక్స్
తెలంగాణలో తొలి హైటెక్ హైవే.. ప్రారంభానికి డేట్ ఫిక్స్
వార్నీ..! ఈ బబుల్‌ ర్యాప్‌ ఎందుకు తయారు చేశారో తెలిస్తే అవాక్కే
వార్నీ..! ఈ బబుల్‌ ర్యాప్‌ ఎందుకు తయారు చేశారో తెలిస్తే అవాక్కే
వాళ్లది స్వార్థ రాజకీయం.. యుద్ధంపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు
వాళ్లది స్వార్థ రాజకీయం.. యుద్ధంపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు
ఊటీ సమ్మర్ ట్రిప్.. తక్కువ ధరకే IRCTC సూపర్ టూర్ ప్యాకేజీ
ఊటీ సమ్మర్ ట్రిప్.. తక్కువ ధరకే IRCTC సూపర్ టూర్ ప్యాకేజీ
సంజు సంచలనం.. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో ఏకంగా 18 స్థానాలు జంప్
సంజు సంచలనం.. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో ఏకంగా 18 స్థానాలు జంప్
రైళ్లల్లో ఫుడ్ సర్వీసులు రద్దు..! రైల్వేశాఖ షాకింగ్ డెసిసన్
రైళ్లల్లో ఫుడ్ సర్వీసులు రద్దు..! రైల్వేశాఖ షాకింగ్ డెసిసన్
మార్కెట్లో కల్తీ పసుపును గుర్తించడానికి సులభమైన 5 చిట్కాలు
మార్కెట్లో కల్తీ పసుపును గుర్తించడానికి సులభమైన 5 చిట్కాలు
అప్పుడు బిజీ చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు టీవీలో చాలా పాపులర్..
అప్పుడు బిజీ చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు టీవీలో చాలా పాపులర్..
వాహనదారులకు గుడ్‌న్యూస్.. పెట్రోల్‌ నిల్వలపై కీలక ఆప్‌డేట్
వాహనదారులకు గుడ్‌న్యూస్.. పెట్రోల్‌ నిల్వలపై కీలక ఆప్‌డేట్