Guntur District: మహిళ భయాన్ని క్యాష్ చేసుకున్న గురూజీ.. 13 లక్షలు కొట్టేసి.. ఆపై లైంగిక వేధింపులు..

మహిళ బలహీనతను ఆసరా చేసుకున్న గురూజీ సరికొత్త ప్లాన్ ను వేశాడు. ఇంట్లో పూజలు చేయాలంటూ ఆ మహిళ నుంచి రూ. 28వేల వసూలు చేశాడు. అంతేకాదు క్రమంగా ఆ మహిళతో పరిచయం పెంచుకొని.. ఆమె బలహీనతను ఆసరాగా తీసుకుని బంగారం తాకట్టు పెట్టించి పదమూడున్నర లక్షలు కాజేశాడు. 

Guntur District: మహిళ భయాన్ని క్యాష్ చేసుకున్న గురూజీ.. 13 లక్షలు కొట్టేసి.. ఆపై లైంగిక వేధింపులు..
Andhra Pradesh News

Edited By:

Updated on: Jun 06, 2023 | 1:26 PM

మనిషిలో నమ్మకం అత్యాశను ఆసరా చేసుకొని దైవం పేరుతో చేస్తున్న మోసాలకు అంతేలేకుండా పోతుంది.  తాజాగా ఓ గురువు పూజల పేరుతో మోసం చేస్తూ అమాయకుల నుంచి డబ్బులను తీసుకుంటున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఇంకా సినిమా డైలాగ్ లో చెప్పాలంటే మార్కెట్ లో నయా దేవుడు వచ్చాడనే విధంగా  గుంటూరు జిల్లాలో ఓ నయా మోసం బయటపడింది. పూజల పేరుతో ఓ గురూజీ మోసాలకు పాల్పడుతున్నాడు. ఓ మహిళ నుంచి డబ్బులు తీసుకుని లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే..

ఓ మహిళ ఇంట్లో దేవుడి ఫోటోలు కాలిపోయాయి.. ఇదేమైనా అపశకునమా అనే అనుమానంతో గురూజీని ఆశ్రయించింది. ఆ మహిళ బలహీనతను ఆసరా చేసుకున్న గురూజీ సరికొత్త ప్లాన్ ను వేశాడు. ఇంట్లో పూజలు చేయాలంటూ ఆ మహిళ నుంచి రూ. 28వేల వసూలు చేశాడు. అంతేకాదు క్రమంగా ఆ మహిళతో పరిచయం పెంచుకొని.. ఆమె బలహీనతను ఆసరాగా తీసుకుని బంగారం తాకట్టు పెట్టించి పదమూడున్నర లక్షలు కాజేశాడు.

అయితే గురూజీ అసలు విషయం బయటపడడంతో తన డబ్బులు తిరిగి ఇవ్వాలని మహిళ డిమాండ్ చేసింది. దీంతో ఆమె నుంచి తీసుకున్న డబ్బులివ్వకుండా..గురూజీ తన అనుచరులతో కలిసి ఆమెపై  లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. అంతటితో ఆగకుండా తిరిగి బాధితురాలిపై ఎస్సీ ఎస్టీ కేసు పెడతామంటూ బెదిరింపులు దిగారు గురూజీ అనుచరులు. దీంతో బాధితురాలు చేసేది ఏమిలేక పోలీసులను ఆశ్రయించింది. కొత్తపేట సీఐ అన్వర్ భాషా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు  ప్రారంభించారు. బాధితురాలి నుంచి తీసుకున్న డబ్బులకి ఆధారాలు సేకరిస్తున్నామని చెప్పారు.  త్వరలోనే అసలు నిజాలు బయటపెడతామని.. నిందితులను పట్టుకుంటామని సిఐ చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..