చంద్రయాన్ 3 మన లక్ష్యం.. ఇస్రోకు పదేళ్ల బాలుడి లేఖ
చంద్రయాన్ 2 చివరి నిమిషంలో విఫలమైనప్పటికీ.. ఇస్రో చేసిన అద్భుతమైన కృషికి ఇప్పటికీ ప్రముఖుల నుంచి ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. ఆత్మ స్థైర్యాన్ని కోల్పోవద్దు అంటూ ఆంజనేయ కౌల్ అనే పదేళ్ల బాలుడు ఇస్రోకి రాసిన ఓ లెటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ లెటర్‌లో అంత ఈజీగా స్థైర్యాన్ని కోల్పోవద్దు. మనం తప్పకుండా చంద్రుడిని చేరుకుని తీరుతాం. చంద్రయాన్ 2 విఫలమైతేనేం. చంద్రయాన్ 3 మన లక్ష్యం అని ఆ బాలుడు […]
చంద్రయాన్ 2 చివరి నిమిషంలో విఫలమైనప్పటికీ.. ఇస్రో చేసిన అద్భుతమైన కృషికి ఇప్పటికీ ప్రముఖుల నుంచి ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. ఆత్మ స్థైర్యాన్ని కోల్పోవద్దు అంటూ ఆంజనేయ కౌల్ అనే పదేళ్ల బాలుడు ఇస్రోకి రాసిన ఓ లెటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆ లెటర్‌లో అంత ఈజీగా స్థైర్యాన్ని కోల్పోవద్దు. మనం తప్పకుండా చంద్రుడిని చేరుకుని తీరుతాం. చంద్రయాన్ 2 విఫలమైతేనేం. చంద్రయాన్ 3 మన లక్ష్యం అని ఆ బాలుడు గుర్తుచేశాడు. 2020వ సంవత్సరం జూన్‌లో లాంచ్ చేయనున్న చంద్రయాన్ 3 తప్పక విజయవంతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. అంతేకాదు ఆర్బిటల్ ఇంకా చంద్రుడి కక్ష్యలో ఉందన్న విషయాన్ని మరిచిపోవద్దని లెటర్‌లో తెలిపాడు. అది మనకు ఛాయాచిత్రాలను పంపిస్తుంది. మనం ఎక్కడికి వెళ్లాలో ఎక్కడ విత్తనాలు వేయాలో కూడా మనకు చెబుతుందని అన్నాడు. విక్రమ్ ల్యాండ్ అయ్యే ఉంటుంది. గ్రాఫికల్ బ్యాండ్స్‌ను మనకు పంపించే పనిలో ఉంటుందని ఆంజనేయులు లెటర్‌లో పేర్కొన్నాడు. ఇస్రో నువ్వు మాకు గర్వకారణం.. దేశం తరపున ఇస్రోకు హృదయపూర్వక కృతజ్ఞతలు. జైహింద్ అని లెటర్‌లో తెలిపాడు. ఇది చూసిన అతని తల్లి జ్యోతి కౌల్.. తన కుమారుడు లిఖిత పూర్వకంగా రాసిన లేఖను ట్విట్టర్‌లో పోస్టు చేసింది.
“Feelings of a Grateful Indian” written by my son who is 10 year old.@isro India is grateful to you. You are our inspiration. @PMOIndia @narendramodi_in pic.twitter.com/wOLAUCf6gX
— Jyoti Kaul ?? (@jytkoul) September 7, 2019