కేంద్రంలో బాబు కీ రోల్ ఛాన్స్ మిస్..జగన్ క్లీన్ స్వీప్
వైసీపీ అధినేత జగన్ చారిత్రిక విజయంతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు డీలా పడ్డారు. కేంద్రంలో జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలనుకున్న ఆయన ఆశలు అడియాసలయ్యాయి. ఏపీలో అటు లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ సాధించిన జగన్ ఇక మొదటిసారి సిఎంగా కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. 17 వ లోక్ సభలో వైసీపీ..బీజేపీ, కాంగ్రెస్ తరువాత మూడో అతి పెద్ద పార్టీగా అడుగు పెట్టబోతోంది. ఏపీలో హోదా సాధనకోసం చంద్రబాబు కేంద్రంతో దీటుగా […]

వైసీపీ అధినేత జగన్ చారిత్రిక విజయంతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు డీలా పడ్డారు. కేంద్రంలో జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలనుకున్న ఆయన ఆశలు అడియాసలయ్యాయి. ఏపీలో అటు లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ సాధించిన జగన్ ఇక మొదటిసారి సిఎంగా కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. 17 వ లోక్ సభలో వైసీపీ..బీజేపీ, కాంగ్రెస్ తరువాత మూడో అతి పెద్ద పార్టీగా అడుగు పెట్టబోతోంది. ఏపీలో హోదా సాధనకోసం చంద్రబాబు కేంద్రంతో దీటుగా పోరాడలేకపోయారన్న భావన ఏపీ ప్రజల్లో బలంగా నాటుకుంది. పైగా రాష్ట్రంతో ఎలాంటి సంబంధం లేని మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ వంటి ఇతరులతో చేతులు కలపడం వంటివి కూడా టీడీపీకి వ్యతిరేక ఫలితాన్ని ఇచ్చాయి. అటు.జగన్ నిర్వహించిన సుదీర్ఘ పాదయాత్రలు ఆయనను ప్రజలకు చేరువ చేశాయి. 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 134 నియోజకవర్గాల్లోఆయన పాదయాత్రలు చేశారు. జగన్ ఇచ్చిన హామీలను కూడా ప్రజలు విశ్వసించారు. పైగా వైసీపీ ప్రచార వ్యూహకర్త పీకే చేసిన కృషి కూడా ఆ పార్టీకి అఖండ విజయాన్ని సాధించిపెట్టింది.



