జనసేన పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ లైవ్…
ఏపీలో తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగిన జనసేనాని పవన్ కళ్యాణ్‌కి చేదు అనుభవం ఎదురైంది. భీమవరం, గాజువాక నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ రెండు స్థానాల్లోనూ ఓటమిపాలయ్యారు. మిగతా నేతలంతా ఒకే నియోజకవర్గం నుంచి పోటీ చేయగా.. పవన్ కళ్యాణ్ మాత్రం రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఓడారు. విశాఖపట్నం జిల్లాలోని గాజువాక నుంచి, పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం నుంచి జనసేనాని ఎన్నికల బరిలో నిలిచారు. కానీ ఆయన అనూహ్యంగా రెండు […]
ఏపీలో తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగిన జనసేనాని పవన్ కళ్యాణ్‌కి చేదు అనుభవం ఎదురైంది. భీమవరం, గాజువాక నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ రెండు స్థానాల్లోనూ ఓటమిపాలయ్యారు. మిగతా నేతలంతా ఒకే నియోజకవర్గం నుంచి పోటీ చేయగా.. పవన్ కళ్యాణ్ మాత్రం రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఓడారు. విశాఖపట్నం జిల్లాలోని గాజువాక నుంచి, పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం నుంచి జనసేనాని ఎన్నికల బరిలో నిలిచారు. కానీ ఆయన అనూహ్యంగా రెండు చోట్లా ఓడిపోయారు. ఓటమి అనంతరం మీడియా ముందుకు వచ్చి ఆయన మాట్లాడారు.
- ఈ ఎన్నికల్లో తమ పార్టీకి ప్రజలు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తామన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్
- ఎన్నికల్లో ఓడిపోయినా.. డబ్బు, మద్యం లాంటివి లేకుండా స్వచ్ఛమైన రాజకీయాలు చేసినందుకు సంతోషంగా ఉందన్నారు
- 25 ఏళ్ళ ప్రస్థానం కోసం పార్టీని పెట్టానని.. చివరి శ్వాస వరకు రాజకీయాల్లోనే ఉంటానన్నారు.
- ఎన్నికల్లో గెలిచిన ప్రధాని మోదీ, జగన్ లకు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్