AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మోడీకి వరంగా మారిన 5 అంశాలు

ఎన్నికల్లో మోదీ, బీజేపీ ఘన విజయానికి ప్రధానంగా అయిదు అంశాలు వరంగా మారాయని విశ్లేషకులు భావిస్తున్నారు. దేశ వ్యాప్తంగా పారిశుధ్యం కోసం టాయిలెట్లను నిర్మించాలని, పేదలకు ఉచితంగా వంట గ్యాస్ కనెక్షన్లను ఇచ్చే పథకాన్ని వర్తింప జేయాలని టార్గెట్ గా పెట్టుకున్న మోడీకి ఇవి అయాచిత వరాలయ్యాయి. 7 కోట్లమందికి పైగా పేదలకు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిన ఘనత, సుమారు 10 కోట్ల టాయిలెట్ల నిర్మాణం వంటివి కూడా ఇందుకు దోహద పడ్డాయి. అలాగే.పుల్వామా దాడిని ఎదుర్కొనేందుకు […]

మోడీకి వరంగా మారిన 5 అంశాలు
Pardhasaradhi Peri
|

Updated on: May 23, 2019 | 8:12 PM

Share
ఎన్నికల్లో మోదీ, బీజేపీ ఘన విజయానికి ప్రధానంగా అయిదు అంశాలు వరంగా మారాయని విశ్లేషకులు భావిస్తున్నారు. దేశ వ్యాప్తంగా పారిశుధ్యం కోసం టాయిలెట్లను నిర్మించాలని, పేదలకు ఉచితంగా వంట గ్యాస్ కనెక్షన్లను ఇచ్చే పథకాన్ని వర్తింప జేయాలని టార్గెట్ గా పెట్టుకున్న మోడీకి ఇవి అయాచిత వరాలయ్యాయి. 7 కోట్లమందికి పైగా పేదలకు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిన ఘనత, సుమారు 10 కోట్ల టాయిలెట్ల నిర్మాణం వంటివి కూడా ఇందుకు దోహద పడ్డాయి. అలాగే.పుల్వామా దాడిని ఎదుర్కొనేందుకు బాలకోట్ వైమానిక దాడులు జరపాలన్న యోచన కూడా బీజేపీకి మంచి ఫలితాన్ని ఇచ్చింది. ఈ దాడులతో పాకిస్తాన్ పట్ల మనదేశం ప్రతీకారంతో రగిలిపోతోందన్న ధోరణితో ఉందని మోదీ ప్రభుత్వం నిరూపించగలిగింది. దేశ భద్రతకు యువత నడుం కట్టాలని మోదీ తన ప్రచార సభల్లో ఇచ్చిన పిలుపు ప్రభావం యువతలో స్పష్టంగా కనిపించింది. ప్రజలతో మమేకమయ్యేందుకు  ‘ సంపర్క్ ఫర్ సమర్థన్ పేరిట బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా జరిపిన పర్యటనలు కూడా ఈ పార్టీ విజయానికి సహకరించాయి. ఆ సందర్భంలో ఆయన అనేకమంది ప్రముఖులతోను, సెలబ్రిటీలతోను భేటీ అయ్యారు.