పంజాబ్ అసెంబ్లీ తీర్మానంపై చర్చిస్తాం, కేంద్రం

కేంద్రం తెచ్చిన రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ పంజాబ్ శాసన సభ ఆమోదించిన తీర్మానంపై కేంద్రం చర్చిస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు.

పంజాబ్ అసెంబ్లీ తీర్మానంపై చర్చిస్తాం, కేంద్రం
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Oct 21, 2020 | 1:22 PM

కేంద్రం తెచ్చిన రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ పంజాబ్ శాసన సభ ఆమోదించిన తీర్మానంపై కేంద్రం చర్చిస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. రైతుల ప్రయోజనాలకోసం మోదీ ప్రభుత్వం కృషి చేస్తోందని, తమ ప్రభుత్వం ప్రతిపాదించిన వ్యవసాయ సంస్కరణలను  మరే ఇతర బిల్లులతోను పోల్చలేమని, ఆ సంస్కరణలు అన్నదాతలకు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన చెప్పారు. అన్నీ ఆలోచించే కేంద్రం రైతు చట్టాలను తెచ్చినట్టు ఆయన పేర్కొన్నారు. కేంద్ర రైతు చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్ అసెంబ్లీ మూడు బిల్లులను నిన్న ఆమోదించింది.

Latest Articles