AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తదుపరి చర్చలకు మేం సిధ్ధం, తేదీ నిర్ణయించండి, రైతు సంఘాలకు కేంద్రం లేఖ, దీక్షలు ప్రారంభించిన అన్నదాతలు

తదుపరి చర్చలకు తాము సిధ్దమని, తేదీ నిర్ణయించాలని కేంద్రం రైతు సంఘాలకు లేఖ రాసింది. మీకు అనువైన తేదీని బట్టి చర్చలు జరుపుదామని వ్యవసాయ శాఖ మంతిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి వివేక్ అగర్వాల్  ఈ లేఖలో పేర్కొన్నారు.

తదుపరి చర్చలకు మేం సిధ్ధం, తేదీ నిర్ణయించండి, రైతు సంఘాలకు కేంద్రం లేఖ, దీక్షలు ప్రారంభించిన అన్నదాతలు
Umakanth Rao
| Edited By: Anil kumar poka|

Updated on: Dec 21, 2020 | 10:24 AM

Share

తదుపరి చర్చలకు తాము సిధ్దమని, తేదీ నిర్ణయించాలని కేంద్రం రైతు సంఘాలకు లేఖ రాసింది. మీకు అనువైన తేదీని బట్టి చర్చలు జరుపుదామని వ్యవసాయ శాఖ మంతిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి వివేక్ అగర్వాల్  ఈ లేఖలో పేర్కొన్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో మళ్ళీ ఉభయ పక్షాల మధ్య చర్చలు జరిగే అవకాశాలున్నాయి. కేంద్రం తెచ్చిన చట్టాలపట్ల మీ అపోహలను తొలగించడానికి రెడీగా ఉన్నామని, ఎలాంటి అరమరికలు లేకుండా సంప్రదింపులు జరుగుతాయని ఆశిస్తున్నామని వివేక్ అగర్వాల్ ఈ లేఖలో తెలిపారు. అయితే సోమవారం నుంచి రైతులు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ప్రతి రోజూ 11 మంది అన్నదాతలు 24 గంటలపాటు నిరశన చేయాలని నిర్ణయించారు. వీరి ఆందోళన సోమవారం నాటికి  26 వ రోజుకు చేరుకుంది. చలిని తట్టుకోలేక, గుండె జబ్బుల వల్ల, యాక్సిడెంట్లలో ఇప్పటివరకు 30 మందికి పైగా రైతులు మరణించారని రైతు సంఘాలు వెల్లడించాయి.

అటు-ఆందోళన చేస్తున్న అన్నదాతలకు అందించేందుకు ఫరీద్ కోట్ జిల్లాకు చెందిన రైతులు 500 కేజీల ‘బేసన్ బర్ఫీ'( సెనగపిండితో చేసిన బర్ఫీ) తీసుకురావడం విశేషం,. ట్రాక్టర్లు, ట్రాలీలలో వీరంతా బయలుదేరి వచ్చారు. ఇలా ఉండగా-కేంద్ర రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ ఓ తీర్మానాన్ని ఆమోదించేందుకు ఈ నెల 23 న కేరళ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానున్నట్టు తెలుస్తోంది. స్పెషల్ అసెంబ్లీని సమావేశపరచాల్సిందిగా గవర్నర్ ను కోరాలని మంత్రివర్గం నిర్ణ యించింది.ఈ విషయమై సీఎం, ప్రతిపక్షనేత ఇద్దరు కూడా ఏకాభిప్రాయానికి వచ్చారని, శాసన సభలో తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందగలదని భావిస్తున్నారు.