బిగ్ బ్రేకింగ్: అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు..ఇంకా కీలక నిర్ణయాలు
ఇండియాలో కరోనా వైరస్ విజృంభిస్తోన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. తాజాగా మార్చి 22 నుంచి 29వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు చేసింది. మహమ్మారి వైరస్ గంటగంటకు మృత్యునాదం చేస్తుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 10 ఏళ్లలోపు చిన్నపిల్లలు, 65 ఏళ్లు దాటిన వృద్దులు కూడా ఇళ్లకే పరిమితమవ్వాలని మార్గనిర్దేశకకాలు జారీ చేసింది కేంద్రం. భారత అంతర్జాతీయ సరిహద్దులు కూడా మూసివేసింది. కేంద్ర ప్రభుత్వ మరికొన్ని కీలక నిర్ణయాలు : […]
ఇండియాలో కరోనా వైరస్ విజృంభిస్తోన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. తాజాగా మార్చి 22 నుంచి 29వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు చేసింది. మహమ్మారి వైరస్ గంటగంటకు మృత్యునాదం చేస్తుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 10 ఏళ్లలోపు చిన్నపిల్లలు, 65 ఏళ్లు దాటిన వృద్దులు కూడా ఇళ్లకే పరిమితమవ్వాలని మార్గనిర్దేశకకాలు జారీ చేసింది కేంద్రం. భారత అంతర్జాతీయ సరిహద్దులు కూడా మూసివేసింది.
కేంద్ర ప్రభుత్వ మరికొన్ని కీలక నిర్ణయాలు :
- అత్యవసర సర్వీసులు మినహా ప్రైవేట్ ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేయాలి
- రైళ్లు, విమాన ప్రయాణీకులకు రాయితీలు రద్దు
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక వారం పని, ఒక వారం సెలవలు
- రోమ్‌లో చిక్కుకున్న భారతీయుల కోసం డ్రీమ్‌లైనర్ విమానం
- సోషల్ డిస్టెన్సింగ్ తప్పనిసరిగా పాటించాలని కేంద్రం సూచన