ఓవైపు రచ్చ.. ఇంకోవైపు భద్రత.. ఏపీలో సూపర్ సీన్

ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ తనకు భద్రత కల్పించాలంటూ కేంద్రానికి రాశారంటున్న లేఖపై ఏపీలో రాజకీయ రచ్చ ఒకవైపు కొనసాగుతుండగానే పోలీసుల యాక్షన్ మొదలైంది. అయితే.. ఈ లేఖ ఎవరు రాశారన్న విషయంపై రచ్చ రాజుకుంటుంటే.. దాని కూపీ లాగడంపై పోలీసులు నిరాసక్తత ప్రదర్శిస్తుండడం విశేషం.

ఓవైపు రచ్చ.. ఇంకోవైపు భద్రత.. ఏపీలో సూపర్ సీన్
Follow us

|

Updated on: Mar 19, 2020 | 5:23 PM

ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ తనకు భద్రత కల్పించాలంటూ కేంద్రానికి రాశారంటున్న లేఖపై ఏపీలో రాజకీయ రచ్చ ఒకవైపు కొనసాగుతుండగానే పోలీసుల యాక్షన్ మొదలైంది. అసలా లేఖ తాను రాయలేదని రమేశ్ కుమార్ అంటుండడం… ఆ లేఖపై సోషల్ మీడియాలో పెద్దగా చర్చ జరుగుతుండడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఒకవైపు రమేశ్ కుమార్‌కు కల్పిస్తున్న భద్రత పెంచేసిన పోలీసు అధికారులు.. అసలా లేఖ నిజమైనదా? లేక రమేశ్ కుమార్ పేరిట మరెవరైనా సృష్టించారా అన్న అంశంపై చర్చతో సంబంధం లేకుండా.. ఎన్నికల కమిషనర్ భద్రతకు చర్యలు ప్రారంభించడం విశేషం.

ప్రస్తుతం ఉన్న ఒక గార్డ్‌ (1+4) స్థానంలో 1+1(2+8) గార్డులకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దాంతో పాటు … ఇప్పటి వరకు రమేశ్ కుమార్‌కు 1+1 గన్‌ మెన్ల స్థానంలో 2+2కు పెంచారు పోలీసులు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ భద్రత పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా ఓ పోలీసు అధికారి నియమించారు. సీఆర్పీఎఫ్‌ ఐజీ సదరన్‌ సెక్టార్‌కు ప్రత్యేక విజ్ఞప్తి చేశారు ఏపీ డీజీపీ గౌతమ్ సావంగ్. డీజీపీ విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయానికి సీఆర్పీఎఫ్‌ భద్రత కల్పించనున్నారు.

నిజానికి బుధవారం రాత్రి ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న వెంటనే రమేశ్ కుమార్‌కు భద్రతను పెంచారు. తెలంగాణ డీజీపీకి కాల్‌ చేసిన ఏపీ డీజీపీ గౌతం సావంగ్.. ఆయనకు హెచ్చు భద్రత కల్పించాలని కోరారు. పోలీసులు కేవలం తమ బాధ్యతల కోణంలో ఆలోచిస్తారు కాని, రాజకీయ కోణంలో కాదని పోలీసులు చెబుతున్నారు. తమ పనితీరుపై అనుమానాలు, సంకోచాలు అవసరం లేదని.. అసలు అందుకు తావులేకుండా వ్యవహరిస్తున్నామని పోలీసు శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు.