కేంద్రం సంచలన నిర్ణయం.. ఆర్మీలో మహిళలకు పర్మినెంట్ కమిషన్..
Permanent Commission In Army: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సైన్యంలో మహిళలకు పర్మినెంట్ కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ తాజాగా రక్షణశాఖ కీలక ఉత్తర్వులను జారీ చేసింది. గతేడాది ఫిబ్రవరిలో ఆర్మీలో మహిళలకు శాశ్వత కమిషన్‌ను ఏర్పాటు చేయాలంటూ సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వగా.. ఆ తీర్పు మేరకు గురువారం కేంద్ర రక్షణశాఖ పర్మినెంట్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఇక కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల సైన్యంలో మహిళలకు ప్రాధాన్యత పెరగడమే కాకుండా ఉన్నత […]

Permanent Commission In Army: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సైన్యంలో మహిళలకు పర్మినెంట్ కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ తాజాగా రక్షణశాఖ కీలక ఉత్తర్వులను జారీ చేసింది. గతేడాది ఫిబ్రవరిలో ఆర్మీలో మహిళలకు శాశ్వత కమిషన్‌ను ఏర్పాటు చేయాలంటూ సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వగా.. ఆ తీర్పు మేరకు గురువారం కేంద్ర రక్షణశాఖ పర్మినెంట్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది.
ఇక కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల సైన్యంలో మహిళలకు ప్రాధాన్యత పెరగడమే కాకుండా ఉన్నత పదవులు పొందేందుకు అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా ఆర్మీలో మహిళలు ఇకపై విస్తృతమైన పాత్ర పోషించే అవకాశం ఉంటుందని ఆర్మీ అధికార ప్రతినిధి కల్నల్ అమన్ ఆనంద్ తెలిపారు. అటు ఎస్‌ఎస్‌సీ కింద నియమితులైన వారంతా పర్మినెంట్ కమిషన్ కింద మారేలా డాక్యుమెంటేషన్ ప్రక్రియ త్వరలోనే చేపడతామని అన్నారు.




