AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాల్పులతో మార్మోగిన గచ్చిరోలి

మహారాష్ట్రలోని గచ్చిరోలి జిల్లా గురువారం సాయంత్రం కాల్పులతో మార్మోగింది. చాలా రోజుల తర్వాత.. మావోయిస్టలకు, భద్రతా బలగాలకు మధ్య బీకర పోరు చోటుచేసుకుంది. ఈ విషయాన్ని శుక్రవారం నాడు ఓ సీనియర్ పోలీసు..

కాల్పులతో మార్మోగిన గచ్చిరోలి
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 24, 2020 | 6:39 PM

Share

మహారాష్ట్రలోని గచ్చిరోలి జిల్లా గురువారం సాయంత్రం కాల్పులతో మార్మోగింది. చాలా రోజుల తర్వాత.. మావోయిస్టలకు, భద్రతా బలగాలకు మధ్య బీకర పోరు చోటుచేసుకుంది. ఈ విషయాన్ని శుక్రవారం నాడు ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. గురువారం సాయంత్రం జిల్లాలోని కొర్చి ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ చేపడుతుండగా.. అటుగా తారసపడ్డ మావోయిస్టులు కాల్పులకు దిగారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. ఎదురు కాల్పులకు దిగారు. అనంతరం మావోయిస్టులు కాల్పులు జరుపుతూ.. అక్కడే ఉన్న దట్టమైన అడవులకు పారిపోయారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలవ్వలేదని పోలీసులు తెలిపారు.

కాగా, జిల్లాలోని పలు ప్రాంతాల్లో నక్సలైట్ ఉద్యమ నేత చారు మంజుందర్ జ్ఞాపకార్థం ఈ నెల జూలై 28వ తేదీ నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు ‘‘అమరవీరుల వారం’’గా పాటించాలంటూ పోస్టర్లు వెలిసినట్లు సమాచారం. మసేలీ- నవార్గాన్ దారిలో ఈ పోస్టర్లు దర్శనమిచ్చాయని అధికారులు వెల్లడించారు.

Follow Us
ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి శుభవార్త
ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి శుభవార్త
జాతీయ జెండా కలర్లతో డ్రెస్.. ప్రముఖ హీరోయిన్‌పై నెటిజన్ల ఆగ్రహం
జాతీయ జెండా కలర్లతో డ్రెస్.. ప్రముఖ హీరోయిన్‌పై నెటిజన్ల ఆగ్రహం
భార్యను హత్య చేసి పొదల్లోనే పడేసిన భర్త.. ఒక్క సర్జికల్ స్క్రూతో
భార్యను హత్య చేసి పొదల్లోనే పడేసిన భర్త.. ఒక్క సర్జికల్ స్క్రూతో
హైదరాబాద్‌లో దారుణం.. వివాహిత ఆత్మహత్య
హైదరాబాద్‌లో దారుణం.. వివాహిత ఆత్మహత్య
ఇండియా పోస్ట్ సరికొత్త విప్లవం.. అందుబాటులోకి డాక్సేవా,డాక్మిత్రా
ఇండియా పోస్ట్ సరికొత్త విప్లవం.. అందుబాటులోకి డాక్సేవా,డాక్మిత్రా
గుడ్లు ఉడికించేటప్పుడు ఉప్పు ఎందుకు వేస్తారో తెలుసా?
గుడ్లు ఉడికించేటప్పుడు ఉప్పు ఎందుకు వేస్తారో తెలుసా?
రంజీలో తోపు ప్లేయర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన సెలెక్టర్లు..?
రంజీలో తోపు ప్లేయర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన సెలెక్టర్లు..?
అందుకే ఆ వీడియో చేశా.. అసలు విషయమేంటోచెప్పిన జబర్దస్త్ నవదీప్
అందుకే ఆ వీడియో చేశా.. అసలు విషయమేంటోచెప్పిన జబర్దస్త్ నవదీప్
పీఎం కిసాన్ నిధుల విడుదలపై క్లారిటీ.. అకౌంట్లోకి అప్పుడే..
పీఎం కిసాన్ నిధుల విడుదలపై క్లారిటీ.. అకౌంట్లోకి అప్పుడే..
ప్రతీ పది క్రైముల్లో ఒకటి లవ్ జిహాదీయే..!
ప్రతీ పది క్రైముల్లో ఒకటి లవ్ జిహాదీయే..!