AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇడ్లీ, దోసలను మరిపించే రాగి పిండి ఉప్మా.. 5 నిమిషాల్లో చేసేయండి ఇలా..

ఉదయాన్నే లేవగానే అందరికీ పడే మొదటి ప్రశ్న.. "ఈరోజు టిఫిన్ ఏం చేయాలి?" అని. రోజూ తినే ఇడ్లీ, దోసలు తిని బోర్ కొట్టినప్పుడు, లేదా ఉదయం పూట పెద్దగా సమయం లేనప్పుడు ఏది త్వరగా అవుతుందా అని ఆలోచిస్తుంటాం. అలాంటి సమయంలో కేవలం ఐదు నిమిషాల్లో ఎంతో రుచిగా, ఆరోగ్యకరంగా చేసుకునే అద్భుతమైన వంటకమే రాగి పిండి ఉప్మా.

Phani CH
|

Updated on: Jul 24, 2026 | 6:03 PM

Share
రాగులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి అందరికీ తెలిసిందే. పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు రాగి సలిది, రాగి సంకటి తిని ఎంతో బలంగా ఉండేవారు. ఈ రోజుల్లో మళ్లీ రాగుల ప్రాముఖ్యత పెరిగింది. ఈ రాగి ఉప్మా తయారు చేయడం చాలా సులభం. ముందుగా బాండీలో కొద్దిగా నూనె వేసి వేడెక్కాక తాలింపు గింజలు, మినపప్పు, శనగపప్పు వేసి దోరగా వేయించాలి.

1 / 5
అందులోనే పల్లీలు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఉల్లిపాయలు కాస్త రంగు మారాక సన్నగా తరిగిన టమోటా ముక్కలు వేసి మెత్తగా ఉడికించాలి. టమోటాలు బాగా మగ్గిన తర్వాత సుమారు అర కప్పు ముంబై రవ్వ వేసి తక్కువ మంటపై బాగా వేయించాలి.

2 / 5
ముంబై రవ్వ కాస్త వేగాక, అంతే పరిమాణంలో రాగి పిండిని కూడా అందులోనే వేసి పచ్చివాసన పోయే వరకు 2-3 నిమిషాలు వేయించుకోవాలి. ఇప్పుడు వేరొక పక్క కొలత ప్రకారం నీటిని మరిగించి, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఈ మరిగిన నీటిని వేయించి పెట్టుకున్న రవ్వ, రాగి పిండి మిశ్రమంలో కొద్ది కొద్దిగా పోస్తూ ఉండలు కట్టకుండా బాగా కలపాలి.

3 / 5
మూతపెట్టి రెండు నిమిషాలు చిన్న మంటపై ఉడికిస్తే ఉప్మా చక్కగా దగ్గరపడుతుంది. చివరగా కొత్తిమీర తురుము, నెయ్యిలో వేయించిన జీడిపప్పు ముక్కలు చల్లుకుంటే వేడి వేడి రాగి పిండి ఉప్మా సిద్ధమవుతుంది. ఈ ఉప్మాను పల్లి చట్నీ లేదా అల్లం చట్నీతో తింటే రుచి అమృతంలో ఉంటుంది. పిల్లలకి కూడా ఇది ఎంతో బలవర్ధకమైన ఆహారం.

4 / 5
రాగులలో ఉండే పీచు పదార్థం, ఐరన్, క్యాల్షియం శరీరానికి ఎంతో శక్తినిస్తాయి. ఉదయాన్నే ఈ ఉప్మా ఒక్క కప్పు తింటే మధ్యాహ్నం వరకు ఆకలి వేయదు, నీరసం కూడా రాదు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి, షుగర్ వ్యాధితో బాధపడేవారికి ఇది అద్భుతమైన ఉపహారం. మీరు కూడా ఒకసారి ఇంట్లో ప్రయత్నించి చూడండి, మీ ఇంట్లో అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.

5 / 5
Follow Us
జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో ఏ పార్టీకి ఎన్నొచ్చాయంటే?

దీపావళి తర్వాత దగ్గు వేధిస్తోందా? ఈ లక్షణాలు నిర్లక్ష్యం చేయొద్దు

పిల్లల లంచ్ బాక్స్‌లోకి బెస్ట్ రిసిపీ..ఇలా చేస్తే ఇష్టంగా తింటారు

కళ్లముందే కుప్పకూలిన మనిషి.. చుట్టూ జనం ఉన్నా దక్కని సాయం..

అరుదైన ఘనత.. ముఖంపై మచ్చ లేకుండానే పుర్రె అడుగున కణితి తొలగింపు!

దీపావళి ఎఫెక్ట్.. ఢిల్లీలో 1700 దాటిన AQI.. హైదరాబాద్‌లో ఎంతంటే?

కూర అవసరమే లేదు ఈ చారు చేస్తే.. కడుపు నిండుగా తింటారు!

నవంబర్ 11 నుంచి SSC పబ్లిక్‌ పరీక్ష 2027 ఫీజు చెల్లింపులు షురూ..

3వ వన్డేలోకి ఛోటా ప్యాకెట్ ఎంట్రీ.. ఎవరు తప్పుకున్నారంటే?

సత్తుపల్లిలో అర్ధరాత్రి కలకలం: 12 అడుగుల భారీ కొండచిలువ రెస్క్యూ.