AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మబాబోయ్.. సొరకాయ వీరికి యమ డేంజర్.. తింటే ఆరోగ్యం పని అయిపోయినట్లే..

తక్కువ కేలరీలు, ఎక్కువ నీటి శాతం, మంచి ఫైబర్‌తో కూడిన సొరకాయ బరువు తగ్గాలనుకునే వారికి, జీర్ణక్రియను మెరుగుపరుచుకోవాలనుకునే వారికి ఒక అద్భుతమైన ఆహారం. అందుకే చాలామంది ప్రతిరోజూ సొరకాయను తమ డైట్‌లో భాగం చేసుకుంటూ ఉంటారు. అయితే అందరికీ ఆరోగ్యానిచ్చే ఈ కూరగాయ కొందరికీ మాత్రం ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Krishna S
|

Updated on: Jul 24, 2026 | 6:12 PM

Share
షుగర్ వ్యాధితో బాధపడేవారు లేదా తక్కువ రక్తపోటు ఉన్నవారు సొరకాయను ఎక్కువగా తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సొరకాయలో ఉండే కొన్ని సహజ గుణాలు శరీరంలో గ్లూకోజ్ స్థాయిలను వేగంగా తగ్గించే అవకాశం ఉంది. ఇప్పటికే డయాబెటిస్ లేదా లో బీపీ కోసం మందులు వాడుతున్నవారు సొరకాయను లేదా దాని జ్యూస్‌ను పరిమితికి మించి తీసుకుంటే..  బీపీ ఉన్నపళంగా పడిపోయి హైపోగ్లైసీమియా లేదా తీవ్ర స్పృహ తప్పే అవకాశం ఉంది.

1 / 5
కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్, వాత సమస్యలతో బాధపడేవారు కూడా సొరకాయ వాడకంలో జాగ్రత్త వహించాలి. సొరకాయలో ఉండే చలవ చేసే సహజ గుణం వల్ల కొన్ని శరీర తత్వాలకు ఇది విరుద్ధంగా పనిచేస్తుంది. ముఖ్యంగా చల్లటి స్వభావం ఉన్న ఆహారాలు తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు, శరీరంలో బిగుతుదనం పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల ఆర్థరైటిస్ రోగులు దీనిని క్రమంగా తగ్గించడం లేదా సరైన పద్ధతిలో ఉడికించి తీసుకోవడం బెస్ట్.

2 / 5
జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉన్నవారు, తరచూ గ్యాస్, కడుపుబ్బరం లేదా విరేచనాల సమస్యతో బాధపడేవారు సొరకాయ జ్యూస్‌ను నేరుగా తాగడం మంచిది కాదు. సొరకాయలో ఫైబర్, నీటి శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ, పచ్చి సొరకాయ రసం కొందరిలో కడుపులో చికాకును, జీర్ణ సంబంధిత రుగ్మతలను కలిగిస్తుంది. ముఖ్యంగా సున్నితమైన కడుపు ఉన్నవారు సొరకాయను పచ్చిగా జ్యూస్ చేసుకోకుండా, బాగా ఉడికించి కూర రూపంలో మాత్రమే తీసుకోవడం సురక్షితమైన మార్గం.

3 / 5
సొరకాయ విషయంలో అత్యంత ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అంశం దాని చేదు. కొన్నిసార్లు సొరకాయలు చేదుగా ఉంటాయి. ఇందులో కుకుర్బిటాసిన్స్ అనే విషపూరితమైన రసాయన సమ్మేళనాలు ఉండటం వల్లే ఆ చేదు వస్తుంది. చేదుగా ఉన్న సొరకాయ రసాన్ని తాగడం వల్ల తీవ్రమైన కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు, రక్తస్రావం, కొన్నిసార్లు ప్రాణాపాయ స్థితి కూడా సంభవించవచ్చు. కాబట్టి సొరకాయను వండే ముందు లేదా జ్యూస్ చేసే ముందు చిన్న ముక్కను రుచి చూసి, చేదుగా ఉంటే వెంటనే పారేయాలి.

4 / 5
సొరకాయ అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించే అద్భుతమైన కూరగాయ అయినప్పటికీ, మీ శరీర తత్వాన్ని, ప్రస్తుత ఆరోగ్య స్థితిని బట్టి దానిని తీసుకోవడం ముఖ్యం. ఏవైనా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్నవారు లేదా క్రమం తప్పకుండా మందులు వాడేవారు సొరకాయ జ్యూస్‌ను ప్రతిరోజూ తమ డైట్‌లో చేర్చుకునే ముందు వైద్యుల లేదా పోషకాహార నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. సమతుల్య ఆహార నియమాలు పాటిస్తూ, సరైన మోతాదులో తీసుకున్నప్పుడే ఆరోగ్యకరమైన ఫలితాలు సాధ్యమవుతాయి.

5 / 5
Follow Us