వివేకా హత్య కేసు : సీబీఐ దూకుడు

మాజీమంత్రి, జగన్ చిన్నాన్న వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను సీబీఐ వేగవంతం చేసింది. ప్రస్తుతం కీలక అనుమానితులను విచారిస్తోంది. సిట్ అధికారులు ఇప్పటివరకు ప్రశ్నించని వారిని సైతం సీబీఐ విచారణకు పిలుస్తోంది. రెండో విడత విచారణలో భాగంగా కడప సెంట్రల్ జైలులోని అతిథి గృహంలో పది మంది సీబీఐ అధికారులు…. సోమవారం పది మంది అనుమానితులను 7 గంటల పాటు ప్రశ్నించారు. ఉదయమే ఇద్దరు ముస్లిం మహిళలు సీబీఐ విచారణకు హాజరయ్యారు. వారితో వివేకానందరెడ్డికి ఉన్న ఆర్థిక […]

వివేకా హత్య కేసు : సీబీఐ దూకుడు
Follow us

|

Updated on: Sep 21, 2020 | 9:18 PM

మాజీమంత్రి, జగన్ చిన్నాన్న వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను సీబీఐ వేగవంతం చేసింది. ప్రస్తుతం కీలక అనుమానితులను విచారిస్తోంది. సిట్ అధికారులు ఇప్పటివరకు ప్రశ్నించని వారిని సైతం సీబీఐ విచారణకు పిలుస్తోంది. రెండో విడత విచారణలో భాగంగా కడప సెంట్రల్ జైలులోని అతిథి గృహంలో పది మంది సీబీఐ అధికారులు…. సోమవారం పది మంది అనుమానితులను 7 గంటల పాటు ప్రశ్నించారు. ఉదయమే ఇద్దరు ముస్లిం మహిళలు సీబీఐ విచారణకు హాజరయ్యారు. వారితో వివేకానందరెడ్డికి ఉన్న ఆర్థిక లావాదేవీలు, ఇతర విషయాలపై ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

కర్నూలు గవర్నమెంట్ ఆసుపత్రిలో వైద్యుడిగా పనిచేస్తున్న డాక్టర్ చిన్నన్నను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. డాక్టర్ చిన్నన్నకు పులివెందులకు చెందిన సుధాకర్ రెడ్డికి మధ్య సంబంధాలు ఉన్నాయి. సుధాకర్ రెడ్డిని కూడా సీబీఐ విచారణకు పిలిచింది. అయితే వివేకా మర్డర్ కేసులో వీరిద్దరి నుంచి ఎలాంటి సమాచారం సేకరించారనేది కీలకంగా మారింది. వివేకాతో సన్నిహితంగా మెలిగేవారు, ఆయన ఇంట్లో పనిచేసేవారిని.. ఆర్థిక లావాదేవీలు చూసేవారిని సీబీఐ ప్రధానంగా విచారిస్తోంది. సోమవారం మధ్యాహ్నం ఐదుగురు పులివెందులకు చెందిన యువకులు సీబీఐ విచారణకు హాజరయ్యారు. వీరిలో ఇద్దరు టైలర్లు కాగా, ఇద్దరు వ్యవసాయం చేసేవారు, మరొకరు వాలంటీర్ ఉన్నారు.  రేపు, ఎల్లుండి మరో పదిమంది సీబీఐ అధికారులు కడపకు చేరుకుంటారని తెలుస్తోంది. కేసు విచారణ ముమ్మరం చేయడానికి, అనుమానితులను వరసగా విచారణ చేయడానికి ఎక్కువ సంఖ్యలో అధికారులు రంగంలోకి దిగనున్నారు.

Also Read :

రైతులకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్ !

ఏపీలో ఒక్కసారిగా పెరిగిన కోడిగుడ్డు ధర !