అక్రమాస్తుల కేసు: తండ్రీ కొడుకులకు భారీ ఊరట

అక్రమాస్తుల కేసులో తండ్రీ కొడుకులు, సమాజ్‌వాదీ పార్టీ అగ్రనేతలు ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్‌లకు భారీ ఊరట లభించింది. వీరిద్దరిపై నమోదైన కేసులో క్లీన్‌చిట్ ఇచ్చింది సీబీఐ. ఈ మేరకు అఖిలేష్, ములాయంలపై కేసు నమోదు చేసేందుకు.. తమ వద్ద ఎలాంటి ఆధారాలు లేవని సీబీఐ, సుప్రీం కోర్టుకు తెలిపింది. కాగా అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ.. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారంటూ ములాయం ఫ్యామిలీపై ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై సీబీఐతో విచారణ చేయించాలంటూ కాంగ్రెస్ నేత […]

అక్రమాస్తుల కేసు: తండ్రీ కొడుకులకు భారీ ఊరట
Follow us

| Edited By:

Updated on: May 21, 2019 | 3:23 PM

అక్రమాస్తుల కేసులో తండ్రీ కొడుకులు, సమాజ్‌వాదీ పార్టీ అగ్రనేతలు ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్‌లకు భారీ ఊరట లభించింది. వీరిద్దరిపై నమోదైన కేసులో క్లీన్‌చిట్ ఇచ్చింది సీబీఐ. ఈ మేరకు అఖిలేష్, ములాయంలపై కేసు నమోదు చేసేందుకు.. తమ వద్ద ఎలాంటి ఆధారాలు లేవని సీబీఐ, సుప్రీం కోర్టుకు తెలిపింది.

కాగా అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ.. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారంటూ ములాయం ఫ్యామిలీపై ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై సీబీఐతో విచారణ చేయించాలంటూ కాంగ్రెస్ నేత విశ్వనాథ్ చతుర్వేది 2005లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిని విచారణకు తీసుకున్న న్యాయస్థానం.. 2007లో ములాయం, ఆయన కొడుకులు, కోడలుపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించింది. కొద్ది రోజుల తరువాత ములాయం కోడలు డింపుల్‌కు మినహాయింపు ఇచ్చింది.

అయితే ఆస్తుల కేసులో ములాయం, అఖిలేష్‌లపై ఇప్పటివరకు సీబీఐ.. ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదంటూ విశ్వనాథ్ మరోసారి సుప్రీం తలుపు తట్టారు. దీంతో ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. సీబీఐకి నోటీసులు జారీ చేసింది. ఈ కేసు దర్యాప్తు ఎంతవరకు వచ్చిందో.. తమకు ఓ నివేదిక ఇవ్వాలని సీబీఐని ఆదేశించింది అత్యున్నత న్యాయస్థానం. చివరకు ములాయం, అఖిలేష్‌లకు క్లీన్‌చిట్ ఇస్తూ కోర్టులో మంగళవారం అఫిడవిట్ దాఖలు చేసింది సీబీఐ.

అయితే లోక్‌సభ ఎన్నికల లెక్కింపుకు కొన్ని గంటల ముందు వీరిద్దరికి క్లీన్‌చిట్ రావడంతో జాతీయ రాజకీయాలు కొత్త మలుపు తిరిగాయి. దీంతో ఎస్పీ మద్దతు ఎటువైపు ఉంటుందన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

Latest Articles
మేషరాశిలో బుధుడు అడుగు.. ఈ రాశుల వారు పట్టిందల్లా బంగారమే..
మేషరాశిలో బుధుడు అడుగు.. ఈ రాశుల వారు పట్టిందల్లా బంగారమే..
ముగ్గురికి జీవిత ఖైదు విధించిన కోర్టు.. అసలు కథ ఇదే..
ముగ్గురికి జీవిత ఖైదు విధించిన కోర్టు.. అసలు కథ ఇదే..
చిరుతనా.. కోహ్లీనా.. షాకింగ్ రనౌట్‌తో బిత్తరబోయిన పంజాబ్ బ్యాటర్
చిరుతనా.. కోహ్లీనా.. షాకింగ్ రనౌట్‌తో బిత్తరబోయిన పంజాబ్ బ్యాటర్
అక్షయ తృతీయ రోజు పసిడే ఆమె ప్రాణాలు తీసింది..
అక్షయ తృతీయ రోజు పసిడే ఆమె ప్రాణాలు తీసింది..
అక్షయ తృతీయ ఎఫెక్ట్‌..మహిళలకు షాకింగ్- భారీగా పెరిగిన బంగారం ధరలు
అక్షయ తృతీయ ఎఫెక్ట్‌..మహిళలకు షాకింగ్- భారీగా పెరిగిన బంగారం ధరలు
కత్తుల్లాంటి కళ్లు.. విల్లు లాంటి ఒళ్లు..!!
కత్తుల్లాంటి కళ్లు.. విల్లు లాంటి ఒళ్లు..!!
వైరల్‎గా మారిన ఎన్నికల ఆహ్వాన పత్రిక.. విన్నూత్న ప్రయత్నం అందుకే
వైరల్‎గా మారిన ఎన్నికల ఆహ్వాన పత్రిక.. విన్నూత్న ప్రయత్నం అందుకే
రాజ్‌కు మరో పెళ్లి చేస్తానన్న అపర్ణ.. రాజ్ కన్నీళ్లు తుడిచిన కావ్
రాజ్‌కు మరో పెళ్లి చేస్తానన్న అపర్ణ.. రాజ్ కన్నీళ్లు తుడిచిన కావ్
బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే పన్ను చెల్లించాలా? రూల్స్ ఏంటి?
బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే పన్ను చెల్లించాలా? రూల్స్ ఏంటి?
సల్మాన్ సినిమాకు ఎన్ని కోట్లు అందుకుంటుందంటే..
సల్మాన్ సినిమాకు ఎన్ని కోట్లు అందుకుంటుందంటే..