Cabinet Approves Auction of Spectrum :స్పెక్ట్రమ్ వేలానికి కేంద్ర కేబినెట్ ఆమోదం, 5 జీ కి మినహాయింపు

స్పెక్ట్రమ్ తదుపరి వేలానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ వేలాన్ని మార్చిలో నిర్వహించనున్నారు. ఆ వేలంలో 2,251  మెగా హెట్జ్ లను విక్రయిస్తారని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. అయితే 5 జీ సర్వీసులుగా ఐడెంటిఫై..

Cabinet Approves Auction of Spectrum :స్పెక్ట్రమ్ వేలానికి కేంద్ర కేబినెట్ ఆమోదం, 5 జీ కి మినహాయింపు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 16, 2020 | 6:17 PM

స్పెక్ట్రమ్ తదుపరి వేలానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ వేలాన్ని మార్చిలో నిర్వహించనున్నారు. ఆ వేలంలో 2,251  మెగా హెట్జ్ లను విక్రయిస్తారని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. అయితే 5 జీ సర్వీసులుగా ఐడెంటిఫై చేసినవాటిని స్పెక్ట్రమ్ ఫ్రీక్వెన్సీలలో అమ్మకానికి పెట్టబోమని స్పష్టం చేశారు. 700 ఎం హెచ్ జెడ్, 800, 900, 2,100, 2,300, 2,500 ఎం హెచ్ జెడ్ ల బాండ్లను వేలానికి పెట్టడం జరుగుతుందని ఆయన చెప్పారు. దరఖాస్తులకు సంబంధించి ఈ నెలలోనే నోటీసును జారీ చేస్తామన్నారు. రూ. 5.22 లక్షల కోట్ల విలువైన స్పెక్ట్రమ్ వేలాన్ని టెలికం  శాఖలోని డిజిటల్ కమ్యూనికేషన్ గత మే నెలలోనే ఆమోదించింది. ఇందులో 5 జీ సర్వీసుల రేడియో వేవ్స్ కూడా ఉన్నాయి.

రూ. 3.92 లక్షల కోట్ల విలువైన స్పెక్ట్రమ్ డాట్ లో వినియోగం లోకి రాకుండా ఉన్నట్టు రిలయన్స్ జియో తెలిపింది. ఇక రూ. 3,500 కోట్ల షుగర్ ఎక్స్ పోర్ట్ సబ్సిడీని కూడా కేంద్రం ఆమోదించింది.

ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ స్పెక్ట్రమ్ వేలానికి సంబంధించి డాట్ చేసిన ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం. టెల్కోస్ కు మొబైల్ సర్వీసులను ప్రొవైడ్ చేసేందుకు ఈ బాండ్లను 20 ఏళ్ళ పాటు ఆఫర్ చేయనున్నారు. వేలంలో ‘విజేతలైన’ కంపెనీలు స్పెక్ట్రమ్ వినియోగానికి సంబంధించి హక్కులను పొందిన తరువాత తమ నెట్ వర్క్ కెపాసిటీని పెంచుకోగలుగుతాయి. అలాగే కొత్త ‘ప్లేయర్స్’ తమ తమ టెలికం సర్వీసులను పొందగలుగుతారు. కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు మౌలిక సదుపాయాల కల్పనకు, డిజిటల్ బూస్ట్ కు తోడ్పడనున్నాయి.

రిలయన్స్ జియో చిరకాల డిమాండ్ ఇదే ! సాధ్యమైనంత త్వరగా వేలం నిర్వహించాలని ఈ సంస్థ కోరుతుండగా..ఎయిర్ టెల్, వీ కంపెనీలు..రిజర్వ్ ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయని పేర్కొంటున్నాయి.