AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సామాన్యులకు షాక్.. భారీగా పెరుగుతున్న వంట గ్యాస్ ధరలు.. మరి ప్రభుత్వ సబ్సిడీ పరిస్థితేంటీ ?..

దేశంలో వరుసగా వంట గ్యా్స్ ధరలు పెరుగుతున్నాయి. అటు ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూన్న విషయం తెలిసిందే. ఇటీవల గ్యాస్ సిలిండర్ ధరలు కూడా భారీగా పెరుగుతూ మధ్య, పేద

సామాన్యులకు షాక్.. భారీగా పెరుగుతున్న వంట గ్యాస్ ధరలు.. మరి ప్రభుత్వ సబ్సిడీ పరిస్థితేంటీ ?..
Rajitha Chanti
|

Updated on: Dec 16, 2020 | 5:33 PM

Share

దేశంలో వరుసగా వంట గ్యా్స్ ధరలు పెరుగుతున్నాయి. అటు ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూన్న విషయం తెలిసిందే. ఇటీవల గ్యాస్ సిలిండర్ ధరలు కూడా భారీగా పెరుగుతూ మధ్య, పేద తరగతి ప్రజలకు భారంగా మారాయి. అయితే ఇటు గ్యాస్ సిలిండర్ ధరలు పెరుగుతున్నా.. ప్రభుత్వ సబ్సిడీ మాత్రం వినియోగదారిడి బ్యాంకు అకౌంట్లలో పడడం లేదు. దీంతో క్రమంగా గ్యాస్ వినియోగదారుడి ఖాతాలలో ఉన్న డబ్బు బదిలీల రూపంలో తగ్గుపోతూ వస్తుంది. ఇందులో రాయితీ సొమ్ము వారి అకౌంట్లలో జమౌతుంది.

అయితే కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ నెలలో రెండు సార్లు గ్యాస్ ధరలను పెంచింది. ఈ ఏడాది డిసెంబర్ 2న 14.2 కిలోల ఎల్‏పీజీ సిలిండర్ ధర రూ.40 వరకు పెంచగా.. మరోసారి 15వ తేదీన ఏకంగా 60 రూపాయాలు పెంచింది. గత నెల క్రితం గ్యాస్ సిలిండర్ ధర రూ.646 ఉండగా.. ఈ 15 రోజుల వ్యవధిలో అమాంతం 100 రూపాయాలు పెరిగి రూ.746కు చేరింది. కేంద్రం వంట గ్యాస్ ధరలను ప్రతినెల ఒకటో తేదిన సవరిస్తుంది.

ప్రస్తుతం ఇండియాలో వంట గ్యాస్ వాడుతున్నవారి సంఖ్య 27.87 కోట్లు ఉండగా.. అందులో ఐదేళ్ళ క్రితం అంటే 2015లో కేవలం 14.86 కోట్లు ఉండేది. ఆంద్రప్రదేశ్‏లో ఇప్పటివరకు మొత్తం 1.38 కోట్లు గ్యాస్ సిలిండర్ కనెక్షన్లు ఉన్నాయి. వీరిలో ప్రతి నెల 1.15 కోట్ల మంది గ్యాస్ తీసుకుంటున్నారు. ఇప్పటీ డిసెంబర్ నెల వరకు గ్యాస్ వినియోగదారులపై రూ.115 కోట్ల భారం పడింది. అటు 2020-21న ఎల్‏పీజీ సబ్సిడీ కోసం కేంద్రం రూ.37,256 కోట్లు కేటాయించింది.

ప్రతి మూడు నెలలకు దాదాపు 8వేల కోట్లకు పైగా చెల్లింపులు జరుగుతున్నాయి. వినియోగదారుల తరుపున పెట్రోలియం కంపెనీలకు చెల్లించాల్సి ఉంటుంది. అటు ఈ ఏప్రిల్-జూన్ మొదటి త్రైమాసికంలో కేవలం రూ.1,900 కోట్లు మాత్రమే కేంద్రం చెల్లించింది. అంతర్జాతీయంగా ధరలు తగ్గటం, సబ్సిడీ భారం తగ్గించుకుంటూ పోతుండటం వలన ఈ ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలలలోనే రూ.6వేల కోట్లకు పైగానే కేంద్రం మిగుల్చుకుంది.

ఈ ఏడాది జనవరిలో వినియోగదారుడు వంట గ్యాస్‏కు చెల్లించాల్సిన ధర రూ.769, కానీ వారి బ్యాంకు అకౌంట్లలో కేవలం రూ.204 మాత్రమే జమ అయ్యాయి. ఈ డిసెంబర్ 1న గ్యాస్ సిలిండర్‏కు వినియోగదారుడు చెల్లించాల్సిన ధర రూ.686, కానీ వినియోగదారుడు ఖాతాల్లో రూ.40 మాత్రమే జమ అయ్యాయి. జనవరి నుంచి నవంబర్ చివరి నాటికి గ్యాస్ ధర రూ.83 మాత్రమే తగ్గించింది. అటు వినియోగదారుడి అకౌంట్లలో పడాల్సిన నగదు మాత్రం రూ.164 తగ్గింది. ఇక ప్రస్తుతం డిసెంబర్ 1 తర్వాత వంట గ్యాస్ సిలిండర్ బుకింగ్ చేసుకున్న వినియోగదారులకు సబ్సిడీ డబ్బులు మాత్రం పడలేదు.

హైదరాబాద్‏లో గత సంవత్సర కాలంగా వంట గ్యాస్ ధరలు.. నెల సిలిండర్ ధర రాయితీ సొమ్ము వివరాలు.. జనవరి నెలలో 769 రాయితీ సొమ్ము రూ.204.5 ఫిబ్రవరి నెలలో 769 రాయితీ సొమ్ము రూ.200.52 మార్చి నెలలో 862 రాయితీ సొమ్ము రూ.279.1 ఏప్రిల్ నెలలో 769.5 రాయితీ సొమ్ము రూ.205.71 మే నెలలో 589.5 రాయితీ సొమ్ము రూ. 0 జూన్ నెలలో 641 రాయితీ సొమ్ము రూ.38.71 జూలై నెలలో 645.5 రాయితీ సొమ్ము రూ.39.71 ఆగస్ట్ నెలలో 646.5 రాయితీ సొమ్ము రూ.40.71 సెప్టెంబర్ నెలలో 646.5 రాయితీ సొమ్ము రూ.40.71 అక్టోబర్ నెలలో 646.5 రాయితీ సొమ్ము రూ.40.71 నవంబర్ నెలలో 646.5 రాయితీ సొమ్ము రూ.40.71 డిసెంబర్ 2వ తేదీ వరకు 686.5 రాయితీ సొమ్ము రూ.0 డిసెంబర్ 15నాటికి 746.5 రాయితీ సొమ్ము రూ.0

2025లో భారత క్రికెట్‌కు వీడ్కోలు పలికిన 10మంది ప్లేయర్లు వీళ్లే
2025లో భారత క్రికెట్‌కు వీడ్కోలు పలికిన 10మంది ప్లేయర్లు వీళ్లే
ఆవు, గేదె పాల కంటే బొద్దింక పాలతో బంపర్‌ బెనిఫిట్స్‌..! లాభాలు
ఆవు, గేదె పాల కంటే బొద్దింక పాలతో బంపర్‌ బెనిఫిట్స్‌..! లాభాలు
గ్రామాల్లో కొత్తగా 70 అన్న క్యాంటీన్లు.. ప్రారంభానికి డేట్ ఫిక్స్
గ్రామాల్లో కొత్తగా 70 అన్న క్యాంటీన్లు.. ప్రారంభానికి డేట్ ఫిక్స్
బయటికొస్తే బంతాటే.. సెలబ్రిటీస్‌కు ఈ తిప్పలేంటి
బయటికొస్తే బంతాటే.. సెలబ్రిటీస్‌కు ఈ తిప్పలేంటి
మెట్రో నగరాలకు పోటీగా బెజవాడ.. ఆన్‌లైన్‌ షాపింగ్‌లో సరికొత్త రికా
మెట్రో నగరాలకు పోటీగా బెజవాడ.. ఆన్‌లైన్‌ షాపింగ్‌లో సరికొత్త రికా
అన్ని రోగాలను హరించే నల్ల వెల్లుల్లి.. ఆరోగ్యానికి మంత్రంలా మారి
అన్ని రోగాలను హరించే నల్ల వెల్లుల్లి.. ఆరోగ్యానికి మంత్రంలా మారి
రౌడీ జనార్ధన టీజర్..ఇదెక్కడి మేకోవర్ సామీ
రౌడీ జనార్ధన టీజర్..ఇదెక్కడి మేకోవర్ సామీ
ఆరోగ్య సిరి.. ఉసిరి తినే ముందు ఈ 6 విషయాలు గుర్తించుకోండి! లేదంటే
ఆరోగ్య సిరి.. ఉసిరి తినే ముందు ఈ 6 విషయాలు గుర్తించుకోండి! లేదంటే
OG సీక్వెల్ నుంచి ఆయన అవుట్.. సూపర్ ట్విస్ట్
OG సీక్వెల్ నుంచి ఆయన అవుట్.. సూపర్ ట్విస్ట్
స్మైల్‌తో కట్టిపడేస్తున్న బ్యూటీ.. ఆషికా అందానికి ఫిదా అవ్వాల్సిం
స్మైల్‌తో కట్టిపడేస్తున్న బ్యూటీ.. ఆషికా అందానికి ఫిదా అవ్వాల్సిం