Busy schedule: ఆఫీస్‌లోనే పెళ్లిచేసుకున్న ఐఏఎస్, ఐపీఎస్!

Busy schedule: కోల్‌కతాలోని అంకితభావంతో పనిచేసే పౌర సేవకులు తమ వివాహానికి బిజీ షెడ్యూల్ వల్ల సమయం లేనందున ఆఫీసులోనే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పంజాబ్‌కు చెందిన తుషార్‌ సింగ్లా 2015లో ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. ప్రస్తుతం కోల్‌కతాలోని ఉలుబెరియాలో ఎస్‌డీవోగా పనిచేస్తున్నారు. పంజాబ్‌ రాష్ట్రానికి చెందిన నవజోత్‌ సిమి 2017లో బిహార్‌ కేడర్‌ నుంచి ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. పట్నాలో విధులు నిర్వహిస్తున్నారు. ఏడాది క్రితం ఓ కార్యక్రమంలో పరిచయమైన వీరి మధ్య స్నేహం చిగురించి, ప్రేమగా మారడంతో […]

Busy schedule: ఆఫీస్‌లోనే పెళ్లిచేసుకున్న ఐఏఎస్, ఐపీఎస్!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Feb 15, 2020 | 9:00 PM

Busy schedule: కోల్‌కతాలోని అంకితభావంతో పనిచేసే పౌర సేవకులు తమ వివాహానికి బిజీ షెడ్యూల్ వల్ల సమయం లేనందున ఆఫీసులోనే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పంజాబ్‌కు చెందిన తుషార్‌ సింగ్లా 2015లో ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. ప్రస్తుతం కోల్‌కతాలోని ఉలుబెరియాలో ఎస్‌డీవోగా పనిచేస్తున్నారు. పంజాబ్‌ రాష్ట్రానికి చెందిన నవజోత్‌ సిమి 2017లో బిహార్‌ కేడర్‌ నుంచి ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. పట్నాలో విధులు నిర్వహిస్తున్నారు. ఏడాది క్రితం ఓ కార్యక్రమంలో పరిచయమైన వీరి మధ్య స్నేహం చిగురించి, ప్రేమగా మారడంతో ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

సింగ్లా మరియు సిమి ఇద్దరూ గుజరాత్ కు చెందినవారు. అయితే పశ్చిమబెంగాల్‌లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తుషార్‌ సింగ్లా ఇటీవల చాలా బిజీగా అయ్యారు. ఈ కారణంగా పెళ్లిని తరచూ వాయిదా వేయాల్సి వచ్చింది. దీంతో ఈ జంట ఓ నిర్ణయానికి వచ్చారు. శుక్రవారం ప్రేమికుల రోజును పురస్కరించుకుని నవజోత్‌ సిమి పట్నా నుంచి కోల్‌కతా వెళ్లారు. అక్కడ సింగ్లా ఆఫీస్‌లో రిజిస్ట్రార్‌ను పిలిచి ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. వధూవరుల కుటుంబ సభ్యులు, ఆఫీస్‌ సిబ్బంది మధ్య రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకుని వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. కాగా.. 2021లో బెంగాల్‌ ఎన్నికలు పూర్తయిన తర్వాత తప్పకుండా గ్రాండ్‌గా విందు ఇస్తామని చెబుతున్నారీ నూతన వధూవరులు.