Budget 2021 Updates: కరోనా నేపథ్యంలో బడ్జెట్ వైపే అందరి చూపు.. ఉద్యోగ కల్పన లేకుండా ఆర్ధిక వేగం సాధించలేమంటున్న నిపుణులు

మోడీ సర్కార్ ఫిబ్రవరి 1 న బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో దేశ ప్రజలందరి చూపు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ వైపే ఉంది. ముఖ్యంగా పెరుగుతున్న జనాభా .. తరుగుతున్న ఆర్ధిక వనరులు.. దీనికి తోడు తాజాగా కరోనా వైరస్ సృష్టించిన...

Budget 2021 Updates: కరోనా నేపథ్యంలో బడ్జెట్ వైపే అందరి చూపు.. ఉద్యోగ కల్పన లేకుండా ఆర్ధిక వేగం సాధించలేమంటున్న నిపుణులు
Follow us
Surya Kala

|

Updated on: Jan 22, 2021 | 4:48 PM

Budget 2021 Updates: మోడీ సర్కార్ ఫిబ్రవరి 1 న బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో దేశ ప్రజలందరి చూపు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ వైపే ఉంది. ముఖ్యంగా పెరుగుతున్న జనాభా .. తరుగుతున్న ఆర్ధిక వనరులు.. దీనికి తోడు తాజాగా కరోనా వైరస్ సృష్టించిన విలయం.. వీటి కారణంగా దేశంలో నిరుద్యోగం గరిష్ట స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో, ఈ సమస్యను పరిష్కరించకుండా ఆర్థిక వ్యవస్థను వేగంగా మెరుగుపరచడం సాధ్యం కాదు. ప్రజలకు ఉపాధి ఉంటేనే ఆదాయం లభిస్తుంది. ఆదాయం బట్టే ఖర్చు చేస్తారు. అయితే కరోనా నేపథ్యంలో డిమాండ్ తగ్గడం వస్తువు ఉత్పత్తి కూడా తగ్గి ఆందోళన కలిగిస్తుంది.

ఈ నేపథ్యంలో 2021 బడ్జెట్ చారిత్రాత్మక బడ్జెట్ అవుతుందని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పలు సందర్భాల్లో చెప్పారు. ఈ బడ్జెట్ కోసం ‘నెవర్ బిఫోర్’ వంటి పదాలను ఉపయోగించారు. దీంతో ఈ సారి ప్రభుత్వం ప్రవేశ పెట్టబోతున్న బడ్జెట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అదే సమయంలో చాలా సవాళ్లు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ వేగాన్ని పెంచడానికి, పెరుగుతున్న డిమాండ్‌పై దృష్టి పెట్టాలి. అంతేకాదు ఉపాధి కల్పించడానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ఉపాధి పెరగకపోతే, డిమాండ్ పెంచడం కష్టం అవుతుంది.

బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం… భారత్ ఆర్ధిక వ్యవస్థ గురించి మాట్లాడాలని అంటే.. స్థానికంగా ఉన్న డిమాండ్ ను లెక్కలోకి తీసుకుంటే జిడిపిలో 60 శాతానికి దగ్గరగా ఉంటుంది. ముఖ్యంగా గ్రామ స్థాయి నుంచి ప్రతి ఒక్కరికీ ఉద్యోగం కల్పించాలి తద్వారా డిమాండ్ వేగవంతం అవుతుంది. ఇది చాలా ముఖ్యమని తెలిపింది. అంతేకాదు కరోనా వ్యాప్తిని అరికట్టడానికి విధించిన లాక్ డౌన్ ప్రభావం ఉద్యోగ కల్పనపై భారీ పడింది. CMIE నివేదిక ప్రకారం.. ఏప్రిల్ తర్వాత నిరుద్యోగ రేటు 24 శాతానికి చేరుకుందని.. అది డిసెంబర్ నాటికి 9.06 శాతానికి పెరిగింది.

ఇటీవల ప్రధాని మోడీ ఆర్ధిక నిపుణులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇన్‌ఫ్రా రంగానికి ఎక్కువ ఖర్చు చేయాల్సిన అవసరం ఉందని బ్యాంక్ ఆఫ్ అమెరికాకు చెందిన ఆర్థికవేత్త ఇంద్రానిల్ సేన్ గుప్తా సూచించారు. కరోనా వైరస్ ప్రభావం డిమాండ్ పై పడిందని చెప్పారు. ఇటువంటి ప్రరిస్థితుల్లో ప్రభుత్వం ముందు రెండు ప్రత్యామ్న్యాయ మార్గాలున్నాయి. ఒకరి ప్రజలకు డబ్బులను అందించాలి.. అపుడు ఆ డబ్బును ఖర్చు చేస్తాడు కనుక డిమాండ్ పెరుగుతుంది.. లేదా టాక్స్ లను తగ్గించాలని తెలిపారు.

ప్రభుత్వం కూడా ఖర్చుకు ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటుంది, అయితే కరోనా అనంతరం ప్రజల్లో ఆదాయ మార్గాలు తగ్గాయి. దీంతో ఆదాయం తగ్గి ఖర్చు తగ్గింది. వస్తువు డిమాండ్ కూడా తగ్గింది. ఈనేపధ్యంలో ఆర్థిక సంవత్సరంలో ద్రవ్య లోటు 3.5 శాతం నుంచి రెట్టింపు అంటే 7.5 శాతంనికి పెరిగింది. అయితే కొంచెం ఊరటనిచ్చే అంశం ఏమిటంటే.. అక్టోబర్-డిసెంబర్ నెలల్లో ప్రభుత్వ పన్ను వసూలు పెరిగింది. భారత ఆర్థిక వ్యవస్థలో ‘వి’ షేప్ రికవరీ ఉంటుందని చాలా మంది ఆర్థిక నిపుణులు అంటున్నారు. దీంతో 2021 లో పన్నులు వసూళ్ల వేగం పెరిగి ఆర్ధికంగా గాడిన పడే అవకాశం ఉంటుందని ఆర్ధిక నిపుణులు భావిస్తున్నారు.

Also Read: మీరు అవినీతి చక్రవర్తి.. మీకు వ్యతిరేకంగా పోస్టుపెడుతున్నా.. ఆరెస్ట్ చేయండి సీఎంకు తేజస్వి సవాల్