ఢిల్లీలో ఘనంగా బోనాల పండుగ..!
ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో బోనాల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలను ఎంపీలు కే కేశవరావు, నామా నాగేశ్వరరావు ప్రారంభించారు. రేపు, ఎల్లుండి ఉత్సవాలు కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. అలాగే.. రేపు సాయంత్రం ఇండియా గేట్ నుంచి తెలంగాణ భవన్ వరకు అమ్మవారి ఊరేగింపు జరగనుంది. అనంతరం అమ్మవారి ఘటన ఏర్పాటు చేసి అమ్మవారికి పోతురాజులు, శివసత్తులతో ఆహ్వానం పలుకుతారు. ఈ సందర్భంగా ఎంపీ కేకే మాట్లాడుతూ.. […]
ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో బోనాల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలను ఎంపీలు కే కేశవరావు, నామా నాగేశ్వరరావు ప్రారంభించారు. రేపు, ఎల్లుండి ఉత్సవాలు కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. అలాగే.. రేపు సాయంత్రం ఇండియా గేట్ నుంచి తెలంగాణ భవన్ వరకు అమ్మవారి ఊరేగింపు జరగనుంది. అనంతరం అమ్మవారి ఘటన ఏర్పాటు చేసి అమ్మవారికి పోతురాజులు, శివసత్తులతో ఆహ్వానం పలుకుతారు. ఈ సందర్భంగా ఎంపీ కేకే మాట్లాడుతూ.. లాల్‌దర్వాజ బోనాలు 111 సంవత్సరాల ఉత్సవాల్లో భాగంగా… 111 ఫొటోలతో తెలంగాణ భవన్‌లో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ ఏ వర్గాల పండుగలకైనా సమాన పాధాన్యమిస్తారన్నారు. ముఖ్యంగా బోనాల పండుగను మతసారస్యానికి ప్రతీకగా చేస్తారని చెప్పారు.