బ్రేకింగ్: అదృశ్యమైన బీజేపీ నేత కుమారుడు మృతి
లండన్‌లో పీజీ చదువుతున్న ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షుడు సన్నె ఉదయ్ ప్రతాప్ కుమారుడు శ్రీహర్ష మిస్సింగ్ కేసు విషాదాంతంగా మారింది. ఉన్నత చదువుల కోసం గత రెండు సంవత్సరాల క్రితం లండన్ వెళ్లిన శ్రీహర్ష.. ఆగష్టు 23న అక్కడి ఓ బీచ్‌లో గల్లంతయ్యాడు. 12 రోజుల తర్వాత శ్రీహర్ష మృతదేహాన్ని లండన్ పోలీసులు కనుగొన్నారు. కుమారుడి మరణ వార్త విని కుటుంబీకులు శోకసంద్రంలో మునిగిపోయారు. కాగా లండన్‌లోని బీచ్ దగ్గర శ్రీహర్ష సెల్‌ఫోన్, బ్యాగ్, ల్యాప్‌టాప్‌ను […]

లండన్‌లో పీజీ చదువుతున్న ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షుడు సన్నె ఉదయ్ ప్రతాప్ కుమారుడు శ్రీహర్ష మిస్సింగ్ కేసు విషాదాంతంగా మారింది. ఉన్నత చదువుల కోసం గత రెండు సంవత్సరాల క్రితం లండన్ వెళ్లిన శ్రీహర్ష.. ఆగష్టు 23న అక్కడి ఓ బీచ్‌లో గల్లంతయ్యాడు. 12 రోజుల తర్వాత శ్రీహర్ష మృతదేహాన్ని లండన్ పోలీసులు కనుగొన్నారు. కుమారుడి మరణ వార్త విని కుటుంబీకులు శోకసంద్రంలో మునిగిపోయారు.
కాగా లండన్‌లోని బీచ్ దగ్గర శ్రీహర్ష సెల్‌ఫోన్, బ్యాగ్, ల్యాప్‌టాప్‌ను ఇటీవల పోలీసులు గుర్తించారు. వాటి ఆధారంగా శ్రీహర్ష అదృశ్యమైనట్టు నిర్ధారించుకుని, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో కొడుకు ఆచూకీ కోసం తల్లిదండ్రులు ఆందోళన చెందారు. మరోవైపు శ్రీహర్ష ఆచూకీ కోసం లండన్ పోలీసులు ముమ్మరంగా గాలించారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు సాయంతో లండన్ అధికారులతో బీజేపీ నేతలు సంప్రదింపులు జరిపిన విషయం తెలిసిందే.