Telangana: దమ్మపేటలో విచిత్ర దొంగతనం.. 10 కేజీలు చికెన్ ఎత్తుకెళ్లిన దొంగలు
Telangana: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేటలో ఒక విచిత్ర దొంగతనం జరిగింది. దమ్మపేటలోని ఓ చికెన్ దుకాణం వద్దకు ఉదయం10 గంటల సమయంలో ఒక మహిళ తో పాటు మరో వ్యక్తి కలిసి వచ్చారని, రెండు కేజీల చికెన్ మాంసం కావాలని..

Telangana: మనం చాలా రకాల దొంగతనాల గురించి విన్నాం.. విలువైన నగదు , నగలు చోరీలు జరుగుతూ ఉంటాయి.. ఇళ్లల్లో కోడి పుంజులు, నాటు కోళ్ల దొంగతనాల గురించి తెలుసు, కానీ చికెన్ దొంగతనం జరగడం అవాక్కయ్యారు. ఇపుడు చికెన్ ధరలు పెరిగాయి. చికెన్ ప్రియులకు ఒక విధంగా రేట్లు చూసి కొనలేని పరిస్థితి నెలకొంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేటలో ఒక విచిత్ర దొంగతనం జరిగింది. దమ్మపేటలోని ఓ చికెన్ దుకాణం వద్దకు ఉదయం10 గంటల సమయంలో ఒక మహిళ తో పాటు మరో వ్యక్తి కలిసి వచ్చారని, రెండు కేజీల చికెన్ మాంసం కావాలని 500 రూపాయలు ఇచ్చారని, తాను రెండు కేజీల చికెన్ కొట్టి కవర్ లో పెట్టి, తనకు ఫోన్ రావటంతో మాట్లాడుతూ హడావిడిలో ఉండగా, చికెన్ కోసం వచ్చిన మహిళ, చికెన్ కవర్ తీసుకొని వెళ్లిపోయిందని తెలిపారు.
వేరే వారు తనకు ఆర్డర్ ఇచ్చిన 10 కేజీల చికెన్ మాంసం కూడా కవర్ లో పెట్టి ప్రక్కన ఉంచానని, 10 నిమిషాల తరువాత తాను 10 కేజీల చికెన్ కవర్ చూడగా కనిపించలేదని, ఏమైందో అర్థం కాక తన షాపులోని, సి.సి కెమెరాలో చూడగా, రెండు కేజీల చికెన్ కోసం వచ్చిన మహిళ 10 కేజీల చికెన్ కవర్ ఎత్తుకెళ్లటం కనబడిందని, తాను వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసానని చికెన్ షాప్ యజమాని సుభాని తెలిపాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులతో పాటు స్థానికులు అవాక్కయ్యారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
