AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాలు vs పెరుగు.. బరువు తగ్గడానికి ఏది బెస్ట్..? మీ పొట్టపై వీటి ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోండి..

భారతీయ ఆహారంలో పాలు, పెరుగులకు ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం తాగే చాయ్ నుండి మధ్యాహ్నం తినే భోజనం వరకు ఇవి మన దైనందిన జీవితంలో భాగమయ్యాయి. ప్రోటీన్, కాల్షియం, ఆరోగ్యకరమైన కొవ్వులతో నిండిన ఈ రెండూ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే బరువు తగ్గడం, జీర్ణక్రియ విషయానికి వస్తే ఇవి రెండూ శరీరంపై వేర్వేరు ప్రభావాలను చూపిస్తాయి. పాలు కండరాల పుష్టికి, శక్తికి తోడ్పడితే... పెరుగు ఒక సహజ సిద్ధమైన ప్రోబయోటిక్‌గా పనిచేస్తూ పొట్టను ఆరోగ్యంగా ఉంచుతుంది.

Krishna S
|

Updated on: Jul 12, 2026 | 7:10 AM

Share
 పోషకాల పరంగా తేడాలు: పాలు, పెరుగు ఒకే మూలం నుండి వచ్చినప్పటికీ, తోడు పెట్టే ప్రక్రియ వల్ల పెరుగు యొక్క గుణాలు పూర్తిగా మారిపోతాయి. యూఎస్‌డీఏ ప్రకారం.. 100 మిల్లీలీటర్ల పాలలో సుమారు 3.2 గ్రాముల ప్రోటీన్‌తో పాటు కాల్షియం, విటమిన్ డి పుష్కలంగా ఉంటాయి. అదే సమయంలో స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్ అమన్ ప్రకారం.. 100 గ్రాముల పెరుగులో 3.5 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. పాలతో పోలిస్తే పెరుగులో లాక్టోజ్ పరిమాణం తక్కువగా ఉండటం వల్ల ఇది సులభంగా జీర్ణమవుతుంది.

1 / 5
బరువు తగ్గించడంలో పాలు: పాలను సరైన పద్ధతిలో తీసుకుంటే బరువు తగ్గడానికి అద్భుతంగా సహాయపడతాయి. పాలలో ఉండే అధిక నాణ్యత గల ప్రోటీన్ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచి, అనవసరమైన ఆకలి కోరికలను తగ్గిస్తుంది. 2013 పరిశోధనల ప్రకారం.. పాలలోని కాల్షియం డయాబెటిస్ ఉన్నవారిలో కొవ్వు జీవక్రియను మెరుగుపరిచి, శరీరంలో పేరుకుపోయిన కొవ్వును సమర్థవంతంగా కరిగించడంలో సహాయపడుతుంది. అయితే బరువు తగ్గాలనుకునే వారు లో-ఫ్యాట్ పాలను ఎంచుకోవడం, చక్కెర లేని పాలు తాగడం చాలా ముఖ్యం.

2 / 5
జీర్ణక్రియకు రారాజు:  పొట్ట ఆరోగ్యానికి పెరుగు ఒక మంచి ఔషధం లాంటిది. 2014 అధ్యయనం ప్రకారం.. పెరుగులోని సజీవ బ్యాక్టీరియా ప్రేగులలోని మంచి బ్యాక్టీరియాను పెంపొందించి, అరుగుదలను,పోషకాల శోషణను మెరుగుపరుస్తుంది. 2010 అధ్యయనం ప్రకారం.. ఇందులోని ప్రోబయోటిక్స్ మెటబాలిజాన్ని పెంచి, పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి. ఇది గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తూ రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.

3 / 5
రోజుకు ఎంత తీసుకోవాలి?: న్యూట్రిషనిస్ట్ రూపాలీ దత్తా ప్రకారం.. ఒక సాధారణ వ్యక్తి రోజుకు 500-600 ml వరకు పాలు తీసుకోవచ్చు. అలాగే రోజుకు ఒకటి నుండి రెండు కప్పుల పెరుగు తీసుకోవడం మంచిది. ఆయుర్వేదం ప్రకారం.. పాలను రాత్రి వేళల్లో తీసుకోవడం వల్ల జీర్ణక్రియ బాగుంటుంది. కానీ పెరుగును మాత్రం మధ్యాహ్నం భోజన సమయంలో తీసుకోవడం ఉత్తమం. రాత్రి పూట పెరుగు తినడం వల్ల జలుబు, సైనస్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

4 / 5
ఎవరికి ఏది ముఖ్యం?: మీ లక్ష్యం పొట్ట ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడం అయితే పెరుగును ఎంచుకోవడం ఉత్తమం. అదే కండరాల పుష్టి, రోజంతా శక్తి కావాలనుకుంటే పాలు మంచి ఎంపిక. బరువు తగ్గడానికి ఇవి రెండూ వేర్వేరు మార్గాల్లో సహాయపడతాయి. కాబట్టి ఉదయం లేదా వర్కవుట్ తర్వాత పాలు, మధ్యాహ్నం భోజనంలో పెరుగు చేర్చుకోవడం ద్వారా రెండింటి ప్రయోజనాలను పొందవచ్చు. అయితే లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉన్నవారు, చర్మ సమస్యలు ఉన్నవారు పాలకు దూరంగా ఉండాలి.

5 / 5
Follow Us