AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ప్రైవేట్ ఆస్పత్రిలో వరుస హత్యలు.. ఏకంగా ఆరు ఓటీటీల్లో ట్రెండ్ అవుతోన్న సరికొత్త క్రైమ్ థ్రిల్లర్

సాధారణంగా ఏ సినిమా అయినా ఒకటి లేదా రెండు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో వస్తుంది. కానీ ఈ సినిమా కంటెంట్ మీద నమ్మకంతో ఏకంగా ఆరు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కు తీసుకొచ్చారు మేకర్స్. అందుకు తగ్గట్టుగానే ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఆడియెన్స్ కు మంచి థ్రిల్ అందిస్తోంది..

OTT Movie: ప్రైవేట్ ఆస్పత్రిలో వరుస హత్యలు.. ఏకంగా ఆరు ఓటీటీల్లో ట్రెండ్ అవుతోన్న సరికొత్త క్రైమ్ థ్రిల్లర్
OTT Movie
Basha Shek
|

Updated on: Jul 12, 2026 | 11:04 AM

Share

గత వారం ఓటీటీల్లో పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు వచ్చాయి. తెలుగుతో పాటు వివిధ భాషలకు చెందిన సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చాయి. రామ్ చరణ్ పెద్ది, సింగ్ గీతం, బల్టీ, పరిమళ అండ్ కో వంటి మరికొన్ని సినిమాలు ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ పై సందడి చేస్తున్నాయి. అలా గత వారమే ఓటీటీలోకి వచ్చిన ఒక సినిమా ఇప్పుడు టాప్ లో ట్రెండ్ అవుతోంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతూ ఆడియెన్స్ కు మంచి థ్రిల్ అందిస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాల్లోని ట్విస్టులు ఆడియెన్స్ మతిపోగుడుతున్నాయి. కొన్ని సీన్స్ అయితే మైండ్ బ్లోయింగ్ అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఓ ప్రైవేట్ హాస్పిటల్లో జరిగే అనుమానాస్పద మరణాలు చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. ఆస్పత్రిలో జాయిన్ అయిన రోగులందరూ వరుసగా చనిపోతుంటారు. మొదట ఈ మరణాలు నార్మల్ గానే అనిపించినా మరణాలు పెరిగే కొద్దీ అనుమానాలు మొదలవుతాయి. ఎవరో ఒక సైకో కిల్లర్ పని కట్టుకుని మరి ఈ హత్యలు చేస్తున్నాడని తెలుస్తుంది. కనీసం మృతుల పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా ఎలాంటి ఆధారాలు దొరకకుండా ఈ హత్యలు జరగడం మరింత షాకింగ్ అనిపిస్తోంది. మరి ఆస్పత్రిలో వరుస హత్యలకు పాల్పడిన ఆ సైకో కిల్లర్ ఎవరు? ఎందుకు ఇలా హత్యలు చేస్తున్నాడు? పోలీసులు అతనిని ఎలా పట్టుకున్నారన్నదే ఈ సినిమా కథ.

ప్రస్తుతం ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న ఈ మలయాళం క్రైమ్ థ్రిల్లర్ పేరు డోస్ (Dose). అభిలాష్ నాయర్ తెరకెక్కించిన ఈ సినిమాలో ‘ప్రేమమ్’ ఫేమ్ సిజు విల్సన్, అశ్విన్ కుమార్, దృశ్య రఘునాథ్, జగదీష్ తదితరులు ప్రధాన కీలకపాత్రలు పోషించారు. ప్రస్తుతం డోస్ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహా తమిళ్, సింప్లీ సౌత్, ఏపీ ఇంటర్నేషనల్, లయన్స్ గేట్ ప్లే, మనోరమా మ్యాక్స్ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులోకి రానుంది. ఈ వీకెండ్ లో మంచి క్రైమ్ థ్రిల్లర్ సినిమా చూడాలనుకునేవారికి డోస్ సినిమా ఒక మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.

ఇవి కూడా చదవండి

ఆరు ఓటీటీల్లో ట్రెండ్ అవుతోన్న మలయాళం మెడికల్ క్రైమ్ థ్రిల్లర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ
వీరి మీద వరాల వర్షం కురిపించబోతున్న భారీ గ్రహం.. పండుగే పండుగ
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల