AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

S. Janaki: పద్మభూషణ్‌ను తిరస్కరించిన జానకమ్మ.. ఎందుకో తెలుసా.?

మైసూర్‌లోని ఓ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచిన ప్రముఖ గాయని ఎస్‌.జానకి అంత్యక్రియలు ఇవాళ (12న) జరగనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆమె పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్థం మైసూర్‌లోని మహారాజా కాలేజ్ గ్రౌండ్స్‌‌లో ఉంచుతారు. అభిమానులు, సినీ, సంగీత ప్రముఖులు నివాళులర్పిస్తారు. సాయంత్రం 5 గంటలకు మైసూర్ సిటీ శివారులోని ప్రైవేట్ ఫామ్‌లో జానకి అంత్యక్రియలు నిర్వహిస్తారు.

S. Janaki: పద్మభూషణ్‌ను తిరస్కరించిన జానకమ్మ.. ఎందుకో తెలుసా.?
S.janaki
Rajeev Rayala
|

Updated on: Jul 12, 2026 | 10:47 AM

Share

భారతీయ సినీ సంగీత చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం సృష్టించిన లెజెండరీ గాయని ఎస్. జానకి గారు. తన అద్భుతమైన గానంతో లక్షలాది మంది హృదయాలను గెలుచుకున్న ఆమె ప్రస్థానంపై, ప్రత్యేకించి ఆమె పద్మభూషణ్ అవార్డును తిరస్కరించిన సంఘటనపై ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ ఆసక్తికరమైన విషయాలను ఓ టీవీ ఛానెల్ తో పంచుకున్నారు. జానకమ్మను వ్యక్తిగతంగా తాను ఎలా చూసేవారో, ఆమె సంగీత ప్రపంచానికి ఎలా ప్రేరణగా నిలిచారో ఆయన వివరించారు. ఎస్. జానకి గారి పేరు చెప్పగానే గుర్తుకొచ్చేవి ఆమె అసాధారణ విజయాలు. ఆమె తన కెరీర్‌లో 12 నంది అవార్డులు, 4 జాతీయ అవార్డులు అందుకున్నారు. 48 వేలకు పైగా పాటలు పాడి, ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్నారు. “ఆమె కేవలం ఒక గాయని కాదు, ఒక సంగీత పాఠశాల. ఇళయరాజా గారి సంగీతం, బాలు గారి వాయిస్‌తో పాటు జానకమ్మ గాత్రం తనను సంగీత ప్రపంచంలోకి రావడానికి ప్రధాన ప్రేరణ” అని ఆర్పీ పట్నాయక్ తెలిపారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, జానకి గారు కలిసి సృష్టించిన పాటలు ఒక మ్యాజిక్ అని, ఆ అద్భుతమైన కలయికను సంగీత ప్రియులు ఎప్పటికీ మరిచిపోలేరని ఆయన అన్నారు. బాలు గారిని ఎలా మిస్ అవుతున్నామో, అంతే స్థాయిలో జానకమ్మను కూడా మిస్ అవుతున్నామని పట్నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి : 23 ఏళ్లకే అన్ని చూసేసా.. ప్రేమ పేరుతో చాలా మంది మోసం చేశారు.. నటి ఎమోషనల్ కామెంట్స్

జానకి గారితో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, మార్చి 21న తాను చివరిసారిగా ఆమెను కలిశానని ఆర్పీ పట్నాయక్ వెల్లడించారు. వైజాగ్‌లో ఆమెను కలిసినప్పుడు, ఆమెతో ఎంతసేపు ఉన్నా తక్కువే అనిపించేదని, ఆమె ఒక పాజిటివ్ సోల్ అని పేర్కొన్నారు. 87 ఏళ్ల వయసులో కూడా ఆమె ఎంతో యాక్టివ్‌గా, ఉత్సాహంగా ఉండేవారని, అందరితో సులభంగా కలిసిపోయేవారని పట్నాయక్ అన్నారు. తన ఇంటికి వచ్చినప్పుడు తన తండ్రితో, కుటుంబ సభ్యులతో సొంత పిల్లల్లాగా కలిసిపోయిన తీరును ఆయన గుర్తుచేసుకున్నారు. ఆమె తమతో కలిసి చేసిన ప్రయాణం ఎప్పటికీ తమకు ఇన్స్పిరేషన్‌గా ఉంటుందని తెలిపారు.

ఇది కూడా చదవండి : అందరూ ఎదో అనుకుంటారు.. కానీ ఆ హీరో గొప్ప డాన్సర్..! అతను డ్యాన్స్ చేస్తుంటే చూస్తుండిపోవాలనిపిస్తుంది..

జానకి గారి గాన ప్రత్యేకత గురించి మాట్లాడుతూ, ఆమె పాట పాడటమే ఒక గైడెన్స్ అని పట్నాయక్ అభిప్రాయపడ్డారు. ఆమె ఎక్స్‌ప్రెషన్, వాయిస్‌లో పలికించే భావం చాలా అరుదైనదని అన్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు స్వయంగా చెప్పినట్లుగా, జానకమ్మ గొంతులో ఎన్ని ఎక్స్‌ప్రెషన్స్ పలికించినా, ఆమె ముఖంలో ఎలాంటి మార్పు ఉండదని, ఒకే ఎక్స్‌ప్రెషన్ ఉంటుందని పట్నాయక్ వివరించారు. “అది ఎలా చేస్తుందో ఆ మహాతల్లి రాక్షసి” అని బాలు గారు ఆమెను మెచ్చుకునేవారని గుర్తుచేసుకున్నారు. తనకు బాగా నచ్చిన పాట “నీ లీల పాడెద దేవా” అని, ఆ పాటను ఆమె ఒకే టేక్‌లో ఎలా పాడేశారో ఇప్పటికీ తనకు పజిల్‌గా ఉందని అన్నారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : నాకు నా తండ్రంటే ఇష్టం లేదు.. అందుకే హిందువుగా మారిపోయా.. సంచలన విషయం చెప్పిన నటుడు

జానకి గారికి పద్మభూషణ్ అవార్డు ఆలస్యంగా రావడం, దానిని ఆమె తిరస్కరించడంపై ఆర్పీ పట్నాయక్ కీలక వ్యాఖ్యలు చేశారు. “అవార్డులకి ఆవిడ పేరు యాడ్ అయితే అవార్డుకి వన్నె వస్తుంది. అవార్డుల వల్ల ఆవిడకేమి ఇది కాదు. అంతవరకు నేను చెప్పగలను. ఎందుకంటే షి ఈజ్ బియాండ్ ఆల్ దోస్ అవార్డ్స్,” అని ఆయన స్పష్టం చేశారు. ఆమెకు పద్మభూషణ్ అవార్డు ఎప్పుడో రావాల్సిందని, అది ఎంత ఆలస్యంగా ఇచ్చారు, అందువల్లే ఆమె దానిని తిరస్కరించారని పట్నాయక్ వెల్లడించారు. జానకి గారు అవార్డులకతీతమైన కళాకారిణి అని, ఆమె కీర్తి ప్రతిష్టలకు ఏ అవార్డు కూడా సాటి రాదని ఆర్పీ పట్నాయక్ అన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Follow Us