బిహార్ మంత్రికి కరోనా..!
బిహార్‌కు చెందిన ఓ మంత్రి ఈ మహమ్మారి బారినపడ్డాడు. బీహార్ మంత్రి ఒకరు కొద్దిపాటి అనారోగ్యంతో కొవిడ్ పరీక్షలు చేయించుకున్నాడు. దీంతో అతనికి కరోనా పాజిటివ్‌గా తేలింది. వెంటనే సదరు మంత్రిని కటిహార్ జిల్లాకేంద్రంలోని ఓ హోటల్‌లో క్వారంటైన్ చేశారు అధికారులు.
కరోనా ధాటికి ప్రపంచవ్యాప్తంగా జనం విలవిలాడుతున్నారు. చిన్నా, పెద్దా తేడాలేకుండా అందర్నీ అంటుకుంటుంది. జనంతో పాటు జనంలో ఉండే నేతలను వదలడం లేదు. తాజాగా, బిహార్‌కు చెందిన ఓ మంత్రి ఈ మహమ్మారి బారినపడ్డాడు. బీహార్ మంత్రి ఒకరు కొద్దిపాటి అనారోగ్యంతో కొవిడ్ పరీక్షలు చేయించుకున్నాడు. దీంతో అతనికి కరోనా పాజిటివ్‌గా తేలింది. వెంటనే సదరు మంత్రిని కటిహార్ జిల్లాకేంద్రంలోని ఓ హోటల్‌లో క్వారంటైన్ చేశారు అధికారులు. రెండురోజుల క్రితం అతడు రాష్ట్ర సెక్రెటేరియట్‌లో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నాడు. కాగా, తన భార్యకు కూడా కరోనా పాజిటివ్ రావొచ్చని ఆందోళన వ్యక్తంచేశాడు. ఇక, అధికారులు మంత్రి కాంటాక్ట్ అయిన వారందర్నీ ట్రేస్ అవుట్ చేసేపనిలో పడ్డారు.