సంగీత కళాకారులను ఆదుకునేందుకు.. 64 రోజులుగా పాడుతున్న సింగర్..

కరోనా వైరస్ విజృంభణ కారణంగా దేశ వ్యాప్తంగా విధించిన లాక్‌‌డౌన్ కారణంగా చాలా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఇందులో చిత్ర పరిశ్రమ కూడా ఉంది. ఇక తెలుగులో అయితే మెగాస్టార్ చిరంజీవి క్రైసిస్ కరోనా పేరిట ఓ ఛారిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ ఛారిటీకి బాలీవుడ్ సీనియర్ హీరో బిగ్‌బీతో పాటు ప్రముఖ సినీ హీరోలందరూ...

సంగీత కళాకారులను ఆదుకునేందుకు.. 64 రోజులుగా పాడుతున్న సింగర్..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jun 28, 2020 | 7:31 PM

కరోనా వైరస్ విజృంభణ కారణంగా దేశ వ్యాప్తంగా విధించిన లాక్‌‌డౌన్ కారణంగా చాలా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఇందులో చిత్ర పరిశ్రమ కూడా ఉంది. ఇక తెలుగులో అయితే మెగాస్టార్ చిరంజీవి క్రైసిస్ కరోనా పేరిట ఓ ఛారిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ ఛారిటీకి బాలీవుడ్ సీనియర్ హీరో బిగ్‌బీతో పాటు ప్రముఖ సినీ హీరోలందరూ విరాళాలు ప్రకటించారు. ఇక చెన్నైలో కూడా లాక్‌డౌన్‌ వేల సంగీత కళాకారుల జీవనోపాధి పూర్తిగా దెబ్బతింది. ఈ క్రమంలోనే చెన్నైకి చెందిన ఓ ప్లే బ్యాక్ సింగర్ వీరికి ఆర్థికంగా అండగా నిలిచేందుకు ముందుకొచ్చాడు. దీంతో పలు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా లైవ్ సింగింగ్ షోలతో విరాళాలు సేకరిస్తున్నారు.

చెన్నైకి చెందిన గాయకుడు సత్యన్ మహాలింగం.. 64 రోజులు లైవ్ సింగింగ్ షోల్లో పాడి ఇప్పటివరకూ రూ.15 లక్షలకు పైగా విరాళాలు సేకరించాడు. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్ బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో ‘సత్యన్ ఉత్సవ్’ పేరుతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. సంగీత కళాకారులకు సాయంగా ఉండేందుకు నిధులు సేకరించడానికి.. మే 30వ తేదీన సత్యన్ సుమారు 25 గంటల పాటు నిర్విరామంగా పాటలు పాడాడు.

ఈ సందర్భంగా ప్లేబ్యాక్ సింగర్ సత్యన్ మహాలింగం మాట్లాడుతూ.. గత నెలలో 40 నుంచి 45 ప్రోగ్రామ్స్ చేసేవాళ్లం. అప్పుడు రూ.50 వేల వరకు వచ్చేవి. లాక్‌డౌన్ ప్రారంభం కాగానే ఆదాయం పడిపోయింది. అందులోనూ నేనూ సంగీత పరిశ్రమకు చెందిన వాడినే కాబట్టి.. జీవితం గడవటం ఎంత కష్టమో తెలుసు. అందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టానని పేర్కొన్నారు.

Read More:

బ్రేకింగ్: కరోనా ఉధృతి నేపథ్యంలో.. మెడికల్ షాపు ఓనర్‌ల కీలక డెసిషన్

బ్రేకింగ్: గుజరాత్ మాజీ సీఎంకి కరోనా పాజిటివ్..

అభిషేక్ బచ్చన్ షాకింగ్ కామెంట్స్.. నా కూతురికి భయపడి అలాంటి సినిమాలు..