బీహార్ కా ‘కహానీ’, తెల్లవారు జామున 3 గంటలు, బీజేపీదే బోణీ !

బీహార్ ఎన్నికల్లో 15 గంటలపాటు  ఓట్ల లెక్కింపు హోరాహోరీగా సాగింది. బుధవారం తెల్లవారుజామున 3 గంటలకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేని విజయం 'సంతృప్తిగా' వరించింది.

  • Umakanth Rao
  • Publish Date - 11:16 am, Wed, 11 November 20
బీహార్ కా 'కహానీ', తెల్లవారు జామున 3 గంటలు, బీజేపీదే బోణీ !

బీహార్ ఎన్నికల్లో 15 గంటలపాటు  ఓట్ల లెక్కింపు హోరాహోరీగా సాగింది. బుధవారం తెల్లవారుజామున 3 గంటలకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేని విజయం ‘సంతృప్తిగా’ వరించింది. 243 మంది సభ్యులున్న అసెంబ్లీలో మెజారిటీ మార్క్ 122 ని దాటేసిన ఎన్డీయే తనకు దాదాపు తిరుగులేదని నిరూపించుకుంది. 74 సీట్లను కైవసం చేసుకుని నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీ-యూకు సీనియర్ మెంబర్ గా తన స్థానాన్ని నిలుపుకుంది. 43 స్థానాలతో జేడీ-యూ సరిపుచ్ఛుకున్నప్పటికీ నితీష్ మాత్రం బేఫికర్ !  కారణం ? ఆయనను తమ సీఎం అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ మొదటే ప్రకటించింది. ఈ హామీకి తమ పార్టీ కట్టుబడి ఉంటుందని బీజేపీ సీనియర్ నేత విజయ్ వర్గీయ వ్యాఖ్యానించారు. కానీ యువనేత, ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ కూడా తక్కువేమీ తినలేదు. ఎన్డీయేకి మహాఘట్ బంధన్ అడుగడుగునా గట్టి పోటీనిచ్చింది. 75 సీట్లను గెలుచుకుని ఏకైక అతి పెద్ద పార్టీగా అవతరించింది. నితీష్ కుమార్ కి ఇవే చివరి ఎన్నికలన్న లోక్ జనశక్తి పార్టీ నేత చిరాగ్ పాశ్వాన్ ఈ ఫలితాలు చూసి ఖంగు తిన్నారు. కేవలం ఒక్క సీటును మాత్రమే ఎల్ జేపీ గెలుచుకోగలిగింది. ఇక మహాఘట్ బంధన్ లో ఒకటిగా ఉన్న కాంగ్రెస్ 70 సీట్లకు పోటీ చేసినా  19 స్థానాలతో సరిపెట్టుకుంది. ఈ ఘట్ బంధన్ లో భాగస్వాములైన లెఫ్ట్ పార్టీల హవా కూడా కనిపించడం విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది. అలాగే ఎం ఐ ఎం కూడా 1 ఈ పార్టీ నేత అసదుద్దీన్ ఒవైసీ కార్యాలయంలో నిన్న సాయంత్రమే కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.

ఏది ఏమైనా, ఈ ఎన్నికల్లో యాంటీ ఇన్ కంబెన్సీ ట్రెండ్ స్పష్టంగా కనిపించింది. నితీష్ కుమార్  స్థాయి ప్రధాని మోదీ పార్టీలో  జూనియర్ పార్ట్ నర్  గా దిగజారింది.